జగన్ పతనం తథ్యం...!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరో రెండురోజులు మాత్రమే సమయం ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి రాజకీయపార్టీలు పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాయి. అధికార వైకాపా తరుపున ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పూర్తిగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, టిడిపి,జనసేన,బిజెపి తరుపున పలువురు ప్రముఖులు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, టిడిపి జాతీయ కార్యదర్శి లోకేష్‌లు కూటమి తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రేపటితో ప్రచారం ముగియనుంది. సోమవారం పోలింగ్ జరగనుండగా.. రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలమైనపరిస్థితి ఉందనే దానిపై పలు సర్వేలు వచ్చాయి. జాతీయ, లోకల్ సంస్థలు నిర్వహించిన సర్వేలో కూటమిదే అధికారమని పేర్కొన్నాయి. అయితే..దీన్ని వైకాపా అంగీకరించడం లేదు. తమకు కనీస మెజార్టీ అయినా వస్తుందని, మళ్లీ తమదే అధికారమని చెబుతోంది. అయితే..గత ఐదేళ్ల వైకాపా పాలనపై నిఖార్సుగా భేరీజు వేసుకుంటే..ఆ పార్టీది మేకపోతు గాంభీర్యమేనని చెప్పవచ్చు. ఎందుకంటే..జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తీసుకుంటే పాలనలో ఆయన ఘోరమైన లోపాలు బయటపడతాయి. ముఖ్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే మాటను ఆయన ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా నోరు తెరిస్తే అబద్దాలు చెబుతున్నారని, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతున్నారనేది ఆయన ప్రత్యర్థులు చేప్పేమాట. తాను అధికారంలోకి వస్తే అమరావతి ఇక్కడనే ఉంటుందని చెప్పి మాట తప్పారు. అదే విధంగా ప్రతి ఏటా ఇస్తానన్న డీఎస్సీ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఇస్తానన్న పిఆర్సీకానీ, రద్దుచేస్తానన్న సిపీఎస్‌కాని చేయలేదు. అదే విధంగా పోలవరం, విశాఖస్టీల్, బాబాయిహత్య కేసు, రైల్వేజోన్‌పై పిల్లిమొగ్గలు..కడప స్టీల్‌ప్లాంట్ ఇలా..ఒకటేమిటి..అధికారంలో ఉన్నప్పుడు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏవో కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసి తాను వందశాతం హామీలను అమలు చేశానని బొంగుతున్నారు. ప్రశ్నించేవారిని పోలీసులచే అరెస్టులు చేయిస్తూ, అథికారాన్ని అడ్డుపెట్టుకుని నిరంకుశంగా ప్రశ్నించే గొంతులను నులిమేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా..అంతా చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రిగా ఆయన పేరుతెచ్చుకున్నారు. కులాల మధ్య కుంపటళ్లు, ప్రాంతాల మధ్య విభేదాలు రాజేసి మరోసారి ముఖ్యమంత్రిగా గెలవాలనుకునే ఆయన కుఠిల వ్యవహారాలను ఆంధ్రాప్రజలు బాగానే అర్థం చేసుకున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ఆంథ్రప్రజలు అసలైన సమయంలో కర్రుకాల్చి వాతపెట్టడానికి సిద్ధమయ్యారు.