టిడిపి కూటమిదే విజయం...!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం నాడు జరగనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే రోజున జరగనున్నాయి. ఐదేళ్ల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం అడ్డమైన దారులు తొక్కుతున్నారు. ఎన్నికల్లో తనకు ప్రయోజనం చేకూరుతుందంటే..ఏమిచేయడానికి అయినా..ఆయన రెడీ అయిపోతున్నారు. చివరకు పండుటాకులను కూడా ఎన్నికల కోసం వాడుకుంటున్నారు. వారి చావులను అడ్డంపెట్టుకుని నాలుగుఓట్లు సంపాదించాలనే కక్కుర్తితో నీచంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఐదేళ్లలో తాను అంతా చేశానని, అక్కచెళ్లెమ్మలకు లక్షకోట్లు గుమ్మరించానని తనకంటే..ఇంకెవరూ చేయలేదనే ముఖ్యమంత్రి ఇప్పుడు ఓట్ల కోసం వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడాల్సిన అవసరం ఏమిటన్నదానిపై మాత్రం నోరువిప్పరు. అదేమంటే చంద్రబాబు కుట్ర అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడుతూ కాలగడుపుతున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండడంతో తన పార్టీ ఏమవుతుందో..అన్న బెంగ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిన్నర క్రితం 175\175 అంటూ డాంబికాలు పలికిన జగన్ ఇప్పుడు తనను ఓడించడానికి అధికారులను మారుస్తున్నారంటూ ఏడుపుగొట్టు స్వరాన్ని అందుకున్నారు. ఎన్నికలు సరిగా జరగవని, తనను ఓడించడానికి అందరూ కలసివస్తున్నారని కలవరం చెందుతున్నారు. ఒకవైపు సింగిల్ సింహం..అంటూనే..మరోవైపు..తనను ఓడిస్తున్నారని సానుభూతికోసం ప్రాకులాడుతున్నారు. నిజంగా ఐదేళ్లలో ప్రజలకు మంచిచేసి ఉంటే..ఇప్పుడు ఇలా దేబిరించాల్సిన అవసరం ఉండేది కాదు. గతంలో ఎన్నడూలేని మెజార్టీతో పాలించమని కుర్చీ ఎక్కిస్తే..ఎక్కిన రోజునుంచే కూల్చడం, కాల్చడం, వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రబుద్ధుడు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండడంతో కళ్లుతేలేస్తున్నాడు.
ఐదేళ్ల క్రితం 151సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ఘోరంగా ఓడిపోతాడనడానికి పెద్దగా కారణాలు వెతుక్కోనవసరం లేదు. మితిమీరిన అంహకారం, అహంభావం, లెక్కలేనితనమే, అత్యాశే అతని పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. తానోదో చక్రవర్తినని, ప్రజలంతా తన బానిసలన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నతీరును ఏమాత్రమైనా ఆత్మాభిమానం ఉన్నవారు సహించలేరు. ప్రజలు పన్నులతో వచ్చిన సొమ్మును కొంత దింగమింగి మిగతా సొమ్మును తన మందిమాగాధులకు పంచి, మిగిలిన అరకొర సొమ్మును పేదలకు బిచ్చంలా వేస్తూ ఇదే పాలన..అంటూ..చిటికెలు వేయించుకుంటున్న తీరును చూసి ఆంధ్ర సమాజం విస్తుపోతోంది. తన స్వార్థం కోసం కులాలు,మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్న విధానం చూసి...ఇటువంటి వ్యక్తినా మనం ఎన్నుకున్నదనే మనోవేదనతో..ప్రజలు మరోసారి..ఇటువంటి వాడికి అధికారం అప్పగించేది లేదనే ఆలోచనకు వచ్చారు. ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు, పోలవరం నిర్మాణం, రాజధాని, మెగా డిఎస్సీ, నిరుద్యోగులకు జాబ్‌క్యాలెండర్, రైతులకు కనీసమద్దతు ధర అంటూ అలవిగాని హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చకుండా..అన్నీ చేశానని చెబుతోన్న జగన్‌తీరుపైనే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. తన పాలనపై ప్రజలు విరక్తితో ఉన్నారనే అంచనాకు వచ్చిన ఆయన ముందుగానే దాదాపు వందమందిని అటుఇటు మార్చి మరోసారి మాయచేయాలనే తలంపుతో వారిని బరిలోకి దింపినా...అనుకున్న ఫలితం రాదని పోస్టల్‌బ్యాలెట్ ద్వారా స్పష్టమైంది. పైన పేర్కొన్న కారణాలతోపాటు మితిమీరిన అవినీతి, పాలనలో పారదర్శికత లేకపోవడం, హితులైన వారికి ప్రభుత్వసొమ్మును దోచిపెట్టడడం, కిందస్థాయిలో పార్టీ నాయకులు సాగించిన దోపిడీ, రాజకీయహింస వెరసి వైకాపా ఓటమికి కారణాలు కాబోతున్నాయి.
అయితే..ఓటర్లను కులాలు,మతాలు, ప్రాంతాల వారీగా విడగొట్టడంలో ఎంతో కొంత సఫలమైన జగన్ దాని ద్వారా కొన్ని సీట్లను పొందుబోతున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఉన్న అంచనాల ప్రకారం ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి దాదాపు 111సీట్లకు పైగా గెలవబోతోందన్నమాట సర్వత్రా వినిపిస్తోంది. వివిధ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం టిడిపికి అనంతపురంలో 12, చిత్తూరులో 8, కడపలో3, కర్నూలులో 4 సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. అదే విధంగా ప్రకాశం జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 12, కృష్ణా జిల్లాలో 12, పశ్చిమగోదావరి జిల్లాలో 12, తూర్పుగోదావరి జిల్లాలో 14, విశాఖలో 12, విజయనగరంలో 5, శ్రీకాకుళం జిల్లాలో 7వరకు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. పోస్టల్ ఓటింగ్ అప్పుడు ఉద్యోగులు వ్యవహరించినట్లు రాష్ట్ర ప్రజలంతా అనుకుంటే..టిడిపి కూటమికి 150 నుంచి 160 సీట్లు వస్తాయి. ఇది ఎలా ఉన్నా..ప్రస్తుత బలాబలాల వారీగా అంచనా వేస్తే..టిడిపికి కనీసం 111 సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.