లేటెస్ట్

బ‌ద్వేల్ టిడిపి అభ్య‌ర్థి ‘రాజ‌శేఖ‌ర్’

‘క‌డ‌ప’ జిల్లా ‘బ‌ద్వేల్’ ఉపఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్థిగా ‘ఓబులాపురం రాజ‌శేఖ‌ర్’ పోటీ చేస్తార‌ని టిడిపి అధినేత ‘చంద్ర‌బాబునాయుడు’ ప్ర‌క‌టించారు. ఈ రోజు క‌డ‌ప జిల్లా టిడిపి నేత‌ల‌తో జ‌రిపిన స‌మీక్ష‌లో ఉప ఎన్నిక‌ల్లో గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోపోటీ చేసి ఓడిపోయిన ‘రాజ‌శేఖ‌ర్’ నే మ‌రోసారి బ‌రిలోకి దించాల‌ని టిడిపి నాయ‌కులు నిర్ణ‌యించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేసి గెలిచిన ‘జి.వెంక‌ట‌సుబ్బ‌య్య’ మృతి చెంద‌డంతో ఇక్క‌డ ఉపఎన్నిక జ‌రగ‌నుంది. అక్టోబ‌ర్ లేదా న‌వంబర్ లో జ‌ర‌గునున్న ఈ ఎన్నిక కోసం టిడిపి అధినాయ‌క‌త్వం ముందే అభ్య‌ర్థిని ఎంపిక చేసి, ఉఎఎన్నిక‌కు స‌న్నాహాలు ప్రారంభించింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైకాపా నుంచి పోటీ చేసిన ‘వెంక‌ట‌సుబ్బ‌య్య’ టిడిపి అభ్య‌ర్థి’ రాజ‌శేఖ‌ర్’ పై దాదాపు 44వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. సార్వ‌త్రిక ఎన్నికలు జ‌రిగి దాదాపు రెండున్న‌రేళ్లు దాటిన త‌రువాత జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టిడిపి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. ముఖ్య‌మంత్రి ‘జ‌గ‌న్’ స్వంత జిల్లా టిడిపి వైకాపాకు ఏ మాత్రం పోటీ ఇస్తుందో చూడాల్సి ఉంది.


వాస్త‌వానికి టిడిపి ఆవిర్భావం నుంచి ఇక్క‌డ ‘టిడిపి’ కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే గెలుపొందింది. ఎన్టీఆర్ టిడిపి స్థాపించి, రాష్ట్ర వ్యాప్తంగా బ్ర‌హ్మాండ‌మైన ఫ‌లితాలుసాధించిన ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డ ‘టిడిపి’ ఓడిపోయింది. అప్ప‌ట్లో కాంగ్రెస్ లో ఉన్న ‘బి.వీరారెడ్డి’ ‘టిడిపి’ అభ్య‌ర్థిని ఓడించారు. ఆయ‌న త‌రువాత టిడిపిలోకి వ‌చ్చి 1985,1994,1999 ఎన్నిక‌ల్లో ‘టిడిపి’ని గెలిపించారు. ఆయ‌న త‌రువాత టిడిపి త‌రుపున పోటీ చేసిన ఏ అభ్య‌ర్థీ ఇక్క‌డ నుంచి గెలుపొంద‌లేదు. టిడిపి ఇక్క‌డ గెలిచి దాదాపు 20 సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది. 2004,2009,2014,2019 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ‘టిడిపి’ ఓట‌మి చ‌విచూసింది. 2009లో ఈ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్ నుంచి ఎస్సీల‌కు రిజర్వ్ అయిన త‌రువాత ‘టిడిపి’ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చావుదెబ్బతింది. గ‌తం గురించి ప‌ట్టించుకోకుండా ఈసారి ఎలాగైనా గెల‌వాల‌నే త‌లంపుతో టిడిపి పెద్ద‌లు ముందుగానే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి రంగంలోకి దిగారు. రెండున్న‌రేళ్ల జ‌గ‌న్ పాల‌న‌పై అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిప‌డుతున్న స‌మ‌యంలో టిడిపి నేత‌లు గ‌ట్టిగా కృషి చేస్తే జ‌గ‌న్ షాక్ ఇవ్వ‌డం పెద్ద‌ప‌నికాద‌నే మాట వినిపిస్తోంది. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ బ‌లాన్ని ఎదుర్కొని విజ‌యం సాధించ‌డం అంత ఆషామాషీ కాదు. కానీ ప్ర‌య‌త్నిస్తే ఫ‌లితం ఉండ‌వ‌చ్చున‌న్నది విశ్లేష‌కుల మాట‌. మ‌రి టిడిపి నేత‌లు ఎలా పోరాడ‌తారో చూడాలి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ