లేటెస్ట్

ఢిల్లీకి సిఎం జ‌గ‌న్...!?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం నాడు కాని లేక గుర‌వారం నాడు దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న గురించి ఇంకా అధికారికంగా ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను ముఖ్య‌మంత్రి క‌ల‌వ‌నున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ సుధీర్ఘ ప‌ర్య‌ట‌న త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ సిఎం ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సిఎం కెసిఆర్  వారం రోజుల ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌ను క‌లిసి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. కృష్ణా,గోదావ‌రి జ‌లాల‌పై తెలంగాణ వాద‌న‌ల‌ను ఆయ‌న వినిపించారు. కెసిఆర్ వాద‌న‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకే సిఎం జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్నార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ ఇచ్చారా..?  లేదా అనే దానిపై స్ప‌ష్ట‌త లేదు. న‌దీజ‌లాల విష‌యంతోపాటు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి,పోల‌వ‌రం అంచ‌నాల‌పెంపు విష‌యాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చిస్తారంటున్నారు. అయితే వీట‌న్నిటితో పాటు రెబెల్ ఎంపి ర‌ఘురామ‌కృష్ణంరాజు అన‌ర్హ‌త విష‌యం గురించి మ‌రోసారి ఫిర్యాదు చేసేందుకే ఆయ‌న ప్రాధాన్య‌త ఇస్తార‌ని తెలుస్తోంది. మ‌రో వైపు మూడు రాజ‌ధానులకు కేంద్ర పెద్ద‌ల‌ను ఒప్పించాల‌ని, వారు క‌నుక గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే ద‌స‌రా త‌రువాత విశాఖ‌కు రాజ‌ధానిని త‌ర‌లించాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ అడుతున్న విష‌యాల‌పై కేంద్ర పెద్ద‌లు స్పందిస్తార‌ని, రాబోయే భార‌త రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అవ‌స‌రం ఉండ‌డంతో వారు జ‌గ‌న్ కోరిన స‌హాయాలు చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ