లేటెస్ట్

రేప‌టి తీర్పుపై న‌మ్మ‌కం లేదు:ర‌ఘురామ‌

అక్ర‌మాస్తుల కేసులో నిందితుడైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో కేసు దాఖ‌లు చేసిన వైకాపా రెబెల్ ఎంపి రఘురామ‌కృష్ణంరాజు మంగ‌ళ‌వారం నాడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రేపటి సీబీఐ కోర్టు తీర్పుపై త‌నకు అనుమానాలు ఉన్నాయ‌ని, సీబీఐ కోర్టులో న్యాయం జ‌రిగే ప‌రిస్థితి లేద‌ని పేర్కొంటూ ఆ కేసును వేరే బెంచ్ కు మార్చాలంటూ ఆయ‌న తెలంగాణ‌ హైకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ర‌ఘురామ దాఖ‌లు చేసిన లంచ్ మోష‌న్ పిటీష‌న్ సాయంత్రం విచార‌ణ‌కు రానుంది. అక్ర‌మాస్తుల కేసులో నిందితుడై జ‌గ‌న్ సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నాడ‌ని, ఆయ‌న బెయిల్ ను ర‌ద్దు చేయాలంటూ రఘురామ‌కృష్ణంరాజు సీబీఐ కోర్టులో కేసు దాఖలుచేశారు. దీనిపై సుదీర్ఘ విచార‌ణ జ‌రిగింది. బుధ‌వారం నాడు తుదితీర్పు వ‌స్తుంద‌న‌గా రఘు ఇప్ప‌డు త‌న‌కు సీబీఐ కోర్టుపై న‌మ్మ‌కం లేద‌రి బెంచ్ ను మార్చాల‌ని హైకోర్టును ఆశ్ర‌యించారు. రేపు తీర్పువ‌స్తుంద‌నే స‌మ‌యంలో ఇలా ఎందుకు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు గ‌త సీబీఐ కోర్టు విచార‌ణ సంద‌ర్భంగా కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ర‌ఘు వేసిన బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింద‌ని, సాక్షి మీడియాలో వార్త‌లు వ‌చ్చాయ‌ని, జ‌గ‌న్ కేసు సీబీఐ కోర్టు కొట్టివేసింద‌ని వారు ఎలా చెప్ప‌గ‌లిగార‌ని, దీనిపై త‌న‌కు సందేహాలు ఉన్నాయ‌ని, సీబీఐ కోర్టు బెంచ్ పై త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని ఆయ‌న హైకోర్టులో వేసిన పిటీష‌న్ లో పేర్కొన్నారు. మొత్తం మీద జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటీష‌న్ దాదాపు ఆరు నెల‌లుగా సంచ‌ల‌నం సృష్టిస్తూనే ఉంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ