శ్రీదేవి హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్
గత నెల 25వ తేదీన సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో అట్లా శ్రీదేవి, ఆమె భర్త అట్ల విజయభాస్కర్ రెడ్డి అలియాస్ భాస్కర్ రెడ్డి కి నంద్యాలలో డయాలసిస్ చేయించి తిరిగి ఆళ్లగడ్డలోని పాతూర్ వీధిలో గల తన ఇంటిలోనికి పోయే సమయంలో కాంపౌండ్ గేటు వద్ద ఉండగా శ్రీదేవి మరిది అయిన అట్ల వేణుగోపాల్ రెడ్డి, అతని భార్య అట్ల శిరీష, జెసిబి డ్రైవర్ రాకేష్ అలియాస్ రాఖీ, డేరంగుల దేవేంద్ర కుమార్, శేఖర్ సింగ్, మేకల నరేష్ అనువారు అట్లా శిరీష కళ్ళలో కారంపొడి చల్లి ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి శ్రీదేవిని తలపై కొట్టగా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె భర్త అయిన అట్ల విజయ భాస్కర్ రెడ్డిని రెండు కాళ్లపై రాడ్లతో కొట్టగా కాళ్లకు బలమైన గాయాలు తగిలి పడిపోయినట్లు విషయం తెలుసుకున్న సిఐ రమేష్ బాబు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా శ్రీదేవి మరణించినట్లు తెలిపారు అనంతరం అట్లా విజయభాస్కర్ రెడ్డిని మెరుగైన వైద్యం నిమిత్తం నంద్యాలకు తరలించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి షేక్ షర్బుద్ధిన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విజయభాస్కర్ రెడ్డి అతని భార్య శ్రీదేవి మరియు అతని తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి అతని భార్య శిరీషలకు మధ్య ఉండబడిన ఆస్తి తగాదాల విషయంలో ఈ హత్యకు దారితీసిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించి ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు అప్పచెప్పుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ముద్దాయిల వద్ద నుండి రెండు బైకులు ఒక కట్టె 5 రాడ్లు మరియు ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి తెలిపారు మరియు ఏవి సుబ్బారెడ్డి అతని కుటుంబ సభ్యులు అతని అనుచరులను విచారించవలసి ఉన్నదని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ వెంకటరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.