లేటెస్ట్

రంగంలోకి ‘చంద్ర‌బాబు’ పాత టీమ్‌...!?

నాల్గ‌వ‌సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా నారా  చంద్ర‌బాబునాయుడు ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న ప‌రిపాల‌న‌పై ప్ర‌త్యేక‌శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్నారు. ఐదేళ్ల జ‌గ‌న్ హయాంలో నాశ‌న‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను ఆయ‌న స‌రిదిద్ద‌డానికి య‌త్నిస్తున్నారు. ముందుగా ఆయ‌న పోల‌వ‌రం, రాజ‌ధాని అమ‌రావ‌తి, త‌రువాత ప‌రిపాల‌నా వ్య‌వ‌స్థ‌పై దృష్టి సారించారు. దీనిలో భాగంగా మళ్లీ ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రంగా మారుస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే ఒక‌సారి పోల‌వ‌రం సంద‌ర్శించి, గ‌త ఐదేళ్ల‌లో జ‌రిగిన న‌ష్టాన్ని అంచ‌నావేశారు. మ‌ళ్లీ పోల‌వ‌రాన్ని ప‌ట్టాలెక్కించ‌డానికి ఏమి చేయాల‌నే దానిపై అంత‌ర్జాతీయ నిపుణుల‌ను పిలిపించి వారి నివేదిక కోరారు. అదే విధంగా రాజ‌ధాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. దానిపై నేడు శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. ముందుగా ఈ రెండు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూనే...పాల‌న‌పై దృష్టి సారించారు. త‌న టీమ్‌ను ఎంపిక చేసుకోవ‌డంలో ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. గ‌తంలో త‌న వ‌ద్ద ప‌నిచేసిన ఐఏఎస్‌ల‌ను ముందుగా ప్రాధాన్య‌త క‌లిగిన పోస్టుల్లోనియ‌మించారు. వారి త‌రువాత ఇప్పుడు గ‌తంలో త‌న వ‌ద్ద స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేసిన పాతత‌రం వారికి ఎటువంటి పోస్టులు కేటాయించాలో అనేదానిపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా గ‌త ప్ర‌భుత్వంలో కీల‌కంగా ప‌నిచేసిన చెరుకూరి కుటుంబ‌రావు, రిటైర్ట్ ఐఏఎస్ లు ల‌క్ష్మీనారాయ‌ణ‌, స‌తీష్‌చంద్ర‌ల‌ను మ‌ళ్లీ త‌న టీమ్‌లోకి తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అదే విధంగా ఏపిసిడిఎస్‌లో ప‌నిచేసిన రైల్వే అధికారి సాంబ‌శివ‌రావును కూడా రాష్ట్ర స‌ర్వీసుకు తీసుకుని కీల‌క‌మైన శాఖ‌ను కేటాయించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న కాకుండా గ‌తంలో స‌మాచార‌శాఖ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ్యాగ్‌జైన్‌కు ఎడిట‌ర్‌గా ప‌నిచేసిన కందుల ర‌మేష్‌ను, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు స‌త్య‌కుమార్‌, మ‌రో జ‌ర్న‌లిస్టు అంక‌బాబును కూడా త‌న టీమ్‌లోకి తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అంక‌బాబును ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా నియ‌మిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే విధంగా గ‌తంలో సిఎంఓలో ప‌నిచేసిన రిటైర్ట్ ఐఏఎస్‌లు స‌తీష్‌చంద్ర‌, ల‌క్ష్మీనారాయ‌ణ‌ను స‌ల‌హాదారులుగాతీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఠ‌క్క‌ర్ కూడా కీల‌క ప‌ద‌వి ల‌భిస్తుందంటున్నారు. నామినేటెడ్ పోస్టుల‌ను వేగంగా భ‌ర్తీ చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలో ఆల‌స్యం జ‌రుగుతుంద‌ని టిడిపి,జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబు పాత టీమ్ మ‌ళ్లీ రంగంలోకి వ‌స్తుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ