లేటెస్ట్

‘ఈటెల’ ఘనవిజయం

తెలంగాణలోని హుజూరాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్‌ ఘనవిజయం సాధించారు. హోరాహోరిగా జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్ధి గెల్లు శ్రీనివాస్‌పై ఆయన 21వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. గత నెల 30వ తేదీన హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. ఓట్ల ఈ రోజు జరిగింది. కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని రౌండ్‌ల్లో ఆధిక్యం సాధించారు. ప్రతి రౌండ్‌లో ఆయన మెజార్టీ సాధిన్తూ వచ్చారు. అయితే అధికార టిఆర్‌ఎస్‌ ‘ఈటెల’కు గట్టి పోటీ ఇచ్చినా..ఆయన గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయింది. ఇటీవల వరకు టిఆర్‌ఎస్‌లోనే ఉన్న ‘ఈటెల’ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్‌తో విబేధాలు వచ్చాయి. అప్పటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ‘ఈటెల’ను మంత్రివర్గం నుంచి భర్తఫ్‌ చేశారు. దీంతో ‘ఈటెల’ ఎమ్మెల్యే పదవికి, టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ‘ఈటెల’ రాజీనామా తరువాత హుజూరాబాద్‌కు ఉప ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో ‘ఈటెల’ను ఎలాగైనా ఓడిరచాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ పలురకాలైన పథకాలను ప్రారంభించారు. హుజూరాబాద్‌లో ఉన్న ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తానని ప్రకటించారు. అదే కాకుండా ఆ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. అయితే...కెసిఆర్‌ జిమ్మిక్కులను హుజూరాబాద్‌ ప్రజలు గట్టిగా తిప్పికొట్టారు. తమకు సొమ్ములు అవసరం లేదని, రాష్ట్ర ప్రగతి ముఖ్యమని తమ ఓటు ద్వారా చాటి చెప్పారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ