‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారం...!
తాను చేయని పని..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తోన్నారన్న దుగ్ధతో జగన్ పత్రిక తప్పుడు ప్రచారాలకు పూనుకుంటోంది. నిన్న మొన్నటిదాకా ఉచిత ఇసుకపై, అంతకు ముందు తెలంగాణకు తిరుమలలో వాటా ఇస్తున్నారంటూ అసత్య ప్రచారాలకు దిగిన వైకాపా మూక ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకంపై తప్పుడు ప్రచారానికి దిగింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆ హామీ అమలులో భాగంగా అర్హులైన విద్యార్ధులు దీనికి ధరఖాస్తు చేసుకోమని సూచిస్తూ విద్యాశాఖ ఒక సర్య్కులర్ విడుదల చేసింది. ఆ సర్య్కులర్‌ను పట్టుకుని సాక్షి చిందులేస్తోంది. ప్రతి ఒక్కరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని హామీ ఇచ్చారు..కానీ..నేడు ఒక్కరికే ఇస్తామని మోసం చేస్తున్నారంటూ..సాక్షి యాగీ చేస్తోంది. వాస్తవానికి ఇచ్చిన సర్య్కులర్‌లో ఎక్కడా ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తామని చెప్పలేదు. కేవలం అర్హులవెరో..? చెబుతూ..వారి ఆధార్ కార్డు, 75శాతం అటెండెన్స్ తదితర వివరాలను మాత్రమే కోరింది. అయితే..దీన్ని సాక్షి తప్పుడుగా ప్రచారం చేస్తోంది. ఇంటికి ఒకరికే ఇస్తారంటూ ఆరోపణలు చేస్తోంది. వాస్తవానికి ఈ పథకం అమలుపై ప్రభుత్వం ఇంత వరకూ జీవో విడుదల చేయలేదు. లబ్దిదారులు ఎంతమందో, ఎంత ఖర్చు అవుతుందో కూడా పేర్కొనలేదు. కానీ అంతలోనే..ఇంటికి ఒక్కరికే ఇస్తారని జగన్ మందిమాగాధుల ప్రచారం చేస్తున్నారు. ఫేక్ ప్రచారంలో ఆరితేరిన వైకాపా, ఇప్పుడు‘తల్లికి వందనం’పై విషప్రచారానికి దిగింది. విద్యార్ధుల కోసం వారి భవిష్యత్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తానని ముఖ్యమంత్రి చెబుతుంటే..సాక్షి మాత్రం అసత్యాలను వండి వారుస్తోంది. కాగా ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడానికి అధికారులు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇచ్చిన సర్య్కులర్‌లో విధానాలను స్పష్టంగా చెబితేపోయేదానికి..లేనిపోని అనుమానాలకు వచ్చే విధంగా విడుదల చేశారు. అయితే..ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా..తాము గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తాము తల్లికివందనం పథకాన్ని అందిస్తామని టిడిపి పార్టీ స్పష్టం చేస్తోంది. మొత్తం మీద..ఫేక్ ప్రచారంలో ఆరితేరిన వైకాపాను ఎదుర్కొవాలంటే ముందుచూపుతో వ్యవహరించాలని, అలా కాకుండా వదిలేస్తే..టిడిపికి గతంలో జరిగిన విధంగానే నష్టం జరుగుతుంది.