ఇద్దరిలో ముందు అరెస్టు అయ్యేదెవరో...!?
అధికారంలో ఉన్నప్పుడు తాము చక్రవర్తులమని, సామంతరాజులన్నట్లు వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు అరెస్టు భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఇద్దరు నేతలంటే వారు అషామాషీ నేతలు కాదు. వారిలో ఒకరు ఇటీవల దాకా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి కాగా, మరొకరు ఆ పార్టీలో నెంబర్ టూ, పార్టీ రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డిలు. వీరిద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అయితే..వీరిపై క్రిమినల్ కేసులు నమోదు కావడం ఇప్పుడేం కొత్త కాదు. గతంలో వీరిద్దరిపై పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.అయితే..ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ కేసుల్లో తీర్పులు రాకుండా, శిక్షలు పడకుండా ఇప్పటి వరకూ తప్పించుకుంటున్నారు. అయితే ఆ కేసులకు బోనస్‌గా ఇప్పుడు ఈ ఇద్దరిపై మరికొన్ని కేసులు రానున్నాయి. అయితే..ఈ కేసులు జగన్ చంద్రబాబుపై పెట్టినట్లు అక్రమ కేసులు కాదు. గత ఐదేళ్ల అధికార మదంతో, కన్నూమిన్నూ కానకుండా చేసిన చేష్టలవల్ల వచ్చిన కేసులు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు క్రిమినల్ కేసు పెట్టగా, సాయిరెడ్డి కేసు మాత్రం లైంగికంగా వేధించిన కేసు. అయితే..ఆయనపై ఇంకా ఈ కేసు నమోదు కాలేదు. త్వరలో ఆయనపై కేసు నమోదు అవుతుంది. ఒకరి భార్యను గర్భవతిని చేసిన ఛండాలమైన కేసు ఇది. తన భార్యను సాయిరెడ్డి గర్భవతినిచేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఓ భర్త కోరుతున్నారు. ఈ కేసు కనుక నమోదు అయితే..విజయసాయిరెడ్డి తప్పక అరెస్టు అవుతారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనను కస్టోడియల్ హింసకు గురిచేశారని, ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ సునీల్‌కుమార్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని రఘురామకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జగన్‌పై కేసు నమోదు అయింది. బెయిల్‌కు వీలు లేని కేసు కావడంతో జగన్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు పంపవచ్చు. అయితే..జగన్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తారు. కోర్టులు కనుక ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే..ఆయన జైలుకు వెళ్లక తప్పదు. జైలు ఆయనకేమీ కొత్తకాదు కానీ..ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అదీ క్రిమినల్‌కేసులో జైలుకువెళ్లడం మాత్రం కొత్తే. కాగా ఆయన అక్రమాస్తుల కేసులో సహనిందితుడు విజయసాయిరెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదు అవుతుంది. దీంతో పాతఖైదీలిద్దరూ..మళ్లీ జైలులో ఊచలు లెక్కపెట్టక తప్పదనే అభిప్రాయం రాజకీయవిశ్లేషకుల్లో ఉంది. ఇద్దరు నేరస్తులకు అధికారం అప్పగిస్తే ఒకరేమో...లక్షల కోట్లు సంపాదించుకుని, ఊరూరా..రాజభవనాలు కట్టుకుంటే..మరో నేరస్తుడు...ఆడవాళ్ల మానాల దోచుకోవడమే పనిగా పెట్టుకుని వికృతానందాన్ని పొందారు. అయితే..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..పాపం పండింది. మళ్లీ పాతనేరస్తులు జైలు దారి పట్టాల్సిందే....!