సాంప్రదాయనే..సుబ్భినే...సుద్దపూసనే...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మీడియా సమావేశానికి చాలా మంది జర్నలిస్టులు ఆసక్తితో హాజరయ్యారు. ఐదేళ్ల పదవీవైభోగ వియోగం తరువాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఏమి చెబుతారా..? తనపై,తన మంత్రులపై వస్తోన్న అవినీతి ఆరోపణలకు ఏమి సమాధానం చెబుతారోనన్న ఆసక్తి వారిలో ఉంది. అయితే..జగన్ తన పాత ధోరణినే కొనసాగించడం..తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆయన చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోవడంతో..ఆయన తీరుమారలేదని తేలిపోయింది. ఎన్‌డిఏ ప్రభుత్వం విడుదల చేస్తోన్న శ్వేతపత్రాలకు సమాధానం అంటూ ఆయన చేసిన వాదనల్లో పసలేదనే విషయం మరోసారి రుజువయింది. ఐదేళ్ల అరాచకాన్ని తట్టుకోలేని ప్రజలు తమ విశ్వరూపాన్ని చూపించి జగన్‌కు అడ్రసు లేకుండా చేసినా..సుద్దపూస కబుర్లు మాత్రం జగన్ మానలేదు. ఐదేళ్లలో నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీసిన జగన్, తాను మద్యపానాన్ని తగ్గించానని జంకులేకుండా బొంకుతున్నాడు. పేదల రక్తమాంసాలతో సారాయి వ్యాపారం చేసిన జగన్, ఇప్పుడు సుద్ధులు చెబుతున్నారు. ఊరూపేరూ లేని బ్రాండ్‌లు తెచ్చి..నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీసిన జగన్ దాన్ని దాచి..చంద్రబాబు కూడా ఊరూపేరూ లేని బ్రాండ్‌లు తెచ్చాడని చెబుతున్నారు. ఐదేళ్లు మద్యంపై ఎంత రభస జరిగినా మీడియా ముందుకు రాకుండా నేడు..చంద్రబాబు కూడా నాసిరకం మద్యం అమ్మాడని చెబితే నమ్మేవాళ్లు ఎవరు..? అదే విధంగా అప్పులు-ఆదాయాల విషయం కూడా...అప్పులు తక్కువ చేసి...రాష్ట్రానికి ఆదాయం పెంచానని గొప్పలు చెబుతున్న జగన్..ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకు చెల్లించలేదో..? విద్యుత్ విషయంలో తనకు అవార్డులు ఇవ్వాలన్న జగన్..ఐదేళ్లలో ప్రజలపై మోపిన భారంపై ఎందుకు మాట్లాడలేదు..? మైగాడ్..ల్యాండ్ టైటిల్ అంటూ భుజాలు ఎగరేసిన జగన్..ల్యాండ్ టైటిల్ విషయంలో ఏమి జరిగిందో..తెలియదా..? ల్యాండ్ సర్వే చేశానని, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నారని ఒకటే వగలు పోతున్న జగన్..ఆ దేశాల్లో సర్వేరాళ్లపై అక్కడి పాలకులు బొమ్మలు వేసుకున్నారో..లేదో..చెబితే..బాగుండేది...? పట్టాదార్‌పాస్ పుస్తకాల్లో తమరి బొమ్మలు ఎందుకో కూడా చెప్పాల్సింది. అదే విధంగా లా అండ్ ఆర్డర్..అబ్బో తమరి పాలనలో లా..అనేదే..ఉందా..పోలీసులు చక్కగా పనిచేశారా..? అవ్వా..అబద్దాలకు అడ్డూఆదుపూ ఉండొద్దా జగన్...నాడు పోలీసులు ఏమి చేశారో..గత ఐదేళ్లలో ఐదు కోట్ల మంది కళ్లారా..చూశారులే..? అవునూ..నువ్వు పోలవరాన్ని ఉద్దరించావా..? రివర్స్ టెండరింగ్‌తో ఆదా చేశావా..? ఓ అభినవ సత్యహరిశ్చంధ్రా..? చాలులే..ఇంక ఆపు..నువ్వు చెప్పే అబద్ధాలు..వినీ..వినీ..విసుగెత్తిన ఆంధ్రా జనం సరైన సమయంలో కొర్రు కాల్చి వాతపెట్టిన సంగతి మరిచిపోకు..? ఇదే విధమైన సంప్రదాయనే..సుబ్బినే..సుద్ధపూసనే..కబుర్లు చెబితే..వచ్చే ఎన్నికల్లో ఈసారి కర్రుకాదు.......!?