‘చంద్రబాబు’ను ‘పెద్దిరెడ్డి’ కొట్టారా..!? ఏది నిజం..!?
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిన్న ఎంపిక చేసిన విలేకరులతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. మాజీ మంత్రి ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ని ఆయన కళాశాల రోజుల్లో కొట్టారని, దాంతో అప్పటి నుంచి ఆయన ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ పై కక్ష సాధిస్తున్నారని ‘జగన్’ సెలవిచ్చారు. తనను కొట్టారనే కక్షతోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ‘పెద్దిరెడ్డి’ కుటుంబాన్ని వేధిస్తున్నారని, వాస్తవానికి ‘పెద్దిరెడ్డి’ కుటుంబమంత మంచి కుటుంబం ఎక్కడా లేదని వారికి భుజకీర్తిలు తొడిగారు. అప్పట్లో కొట్టారు కనుకనే..కక్షసాధిస్తున్నారని, ‘పెద్దిరెడ్డి’ అంత ఉత్తముడు ఎక్కడా లేడనేది జగన్ ఉవాచ. ఐదేళ్ల అధికారంలో చిత్తూరు జిల్లా మొత్తాన్ని దోచేసి వాటాలు పంచిన ‘పెద్దిరెడ్డి’ని కాపాడేందుకే ఇప్పుడు జగన్ సోది కథలు చెబుతున్నారనేది చిత్తూరువాసుల అభిప్రాయం. ఇటువంటి పిట్టకథలు, కోడికత్తి కథలు చెప్పడంలో జగన్‌ను మించినవారు ఉండరేమో..? అప్పడెప్పుడో..వారిద్దరి మధ్య ఏదో జరిగితే..‘చంద్రబాబు’ ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారా.. జగన్...!? ఇలా కక్ష తీర్చుకోవడానికి ‘చంద్రబాబు’ నీలా మొదటిసారే ముఖ్యమంత్రి కాదుకా..? ఆయనకు ఈ పదవి నీలా ఒక్కసారి వచ్చిపోలేదుగా..? ఇప్పటికే ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి కదా..? ‘పెద్దిరెడ్డి’పై కక్ష తీర్చుకోవాలనుకుంటే..ఉమ్మడి రాష్ట్రాన్ని ఆయన మకుటంలేని మహారాజుగా ఏలినరోజుల్లోనే ‘పెద్దిరెడ్డి’ అంతు చూసిఉంటాడు కదా..? పైగా అప్పట్లో ఆయనది ఉడుకురక్తం కదా..? కక్షల్లో, కార్పణ్యాలో ఉంటే..అప్పట్లోనే ‘పెద్దిరెడ్డి’కి, మీ తండ్రి వై.ఎస్‌కు శంకగిరిమాన్యాలు చూపించేవాడు కదా..జగన్...! మరి ఎందుకు అప్పట్లో ఆయన ఆ పనిచేయలేదు..? పోనీ అప్పట్లో వదిలేసినా..2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయినప్పుడైనా..చేయాలి కదా..మరి..అప్పుడెందుకు చేయలేదు..జగన్..? ఇప్పుడు ‘పెద్దిరెడ్డి’ కొట్టాడంటూ..కొత్త కథలు చెపితే..ప్రజలు నమ్మాలి కదా..? చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ చట్టప్రకారమే వెళతారు. అప్పుడేదో..జరిగిందని..ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి ఆయన నీలా ఫ్యాక్షనిస్టు కాదు..రాజనీతిజ్ఙుడు. పిట్టకథలు..చెప్పేముందైనా..జనాలు నమ్ముతారా..లేదో..అని ఆలోచించుకోవాలి.
‘పెద్దిరెడ్డి’ విషయానికి వస్తే..చంద్రబాబు అండతోనే ‘పెద్దిరెడ్డి’ ఎదిగారని చిత్తూరులో ఎవరిని అడిగినా చెబుతారు..చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తరువాత కానీ..ఆయనకు ‘పెద్దిరెడ్డి’ మధ్య ముసుగు ఒప్పందం ఉందనే చర్చరాజకీయ వర్గాల్లో ఉండేది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకోవడానికి చంద్రబాబు ‘పెద్దిరెడ్డి’ని వాడుకునేవారనే చర్చ అప్పట్లో ఉండేది. అప్పట్లో చంద్రబాబుకు కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రాజకీయవైరం ఉండేది. చంద్రబాబు వల్లే తన తండ్రి అమర్‌నాధ్‌రెడ్డి చనిపోయారనే అభిప్రాయం కిరణ్‌కుమార్‌రెడ్డిలో ఉండేదని, అందేకే చంద్రబాబు అంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవరకూ పడేది కాదని, తరువాత కిరణ్ తన అవసరాల కోసం చంద్రబాబు వద్దకు దిగివచ్చారనే చర్చ రాజకీయవర్గాల్లో ఉండేది. కాగా ‘పెద్దిరెడ్డి’కి, కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి శతృత్వం ఉండడంతో..‘పెద్దిరెడ్డి’ చంద్రబాబు పట్ల సానుకూలంగా ఉండేవారని, శత్రువు..శుత్రువు మిత్రుడన్నట్లు ఈ ముగ్గురి మధ్య వ్యవహారం ఉండేది. చిత్తూరు రాజకీయాల్లో ఈ ముగ్గురి మధ్య మూడుముక్కలాట జరిగేది. అయితే...ఇప్పుడు చంద్రబాబు, కిరణ్‌లు దగ్గర కాగా..‘పెద్దిరెడ్డి’ గత ఐదేళ్లలో చంద్రబాబుతో వ్యవహరించిన తీరు, ఆయన చేసిన దోపిడి వల్ల ఇప్పుడు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..తప్ప జగన్ చెప్పిన సోది కథ వల్ల కాదు.