‘జగన్’ ను తిట్టిస్తోన్న ‘విజయసాయిరెడ్డి’ ...!
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కమ్మ సామాజికవర్గాన్ని టార్గట్ చేయడం వెనుక ఆయనకో వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతి చిన్నవిషయానికి కమ్మ..కమ్మ అని ఏడవడం విజయసాయిరెడ్డితో పాటు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అలవాటు. ‘జగన్’ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయనతో పాటు జగన్ పార్టీ వర్గాలన్నీ కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ రాజకీయాలు చేశారు. మొదట రాజధాని అమరావతిని నాశనం చేయడానికి దాన్ని కమ్మరావతి అంటూ ఎద్దేవా చేయడం మొదలు పెట్టారు. దాన్ని ఐదేళ్ల పాటు అలానే కొనసాగించారు. తరువాత కరోనాతో స్థానిక ఎన్నికలను అప్పటి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేయడంతో..ఆయన కమ్మ కాబట్టే ఎన్నికలను వాయిదా వేశారని, ఆయనకు కులం ఆపాదించి సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న జగనే ఆ కులంపై విషం కక్కారు. పార్టీ అధ్యక్షుడే..ఆరకంగా ఉండడంతో..మిగతా వారంతా ఆయనను అనుసరించారు. జగన్ పార్టీలో రెండోస్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి జగన్‌ను మించి కమ్మ సామాజికవర్గంపై దుమ్మెత్తిపోశారు. అయితే..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న రీతిలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వారు చేసిన కుల ప్రచారానికి ఓటర్లు ఓటుతో సమాధానం చెప్పారు. అయితే..ఎన్నికల్లో ఘోరంగా ఓడినా జగన్ కు కానీ, ఆయన మందిమాగాధులకు కానీ బుద్దిరాలేదు. ప్రతిపక్షంలో ఉండి మళ్లీ కుల రాజకీయాలకు తెగబడుతున్నారు. ఓ మహిళాధికారితో విజయసాయిరెడ్డి అక్రమసంబంధం నెరపారని మీడియాలో వార్తలు రావడంతో..విజయసాయిరెడ్డి మీడియాను టార్గెట్‌చేసుకున్నారు. కమ్మ కుల మీడియా అంటూ..చిందులు తొక్కారు. అయితే తనపై వస్తోన్న ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కమ్మ కులాన్ని టార్గెట్‌చేయడాన్ని ప్రజలు ఛీ కొట్టారు.అయితే ఇటు వంటి సత్కారాలు ఆయనకు ఎన్ని జరిగినా..ఆయనకు దున్నపోతు మీద వానకురిసిన చందమే. ఇది..ఇలా ఉంటే..టిటిడి జెఇఓగా వెంకయ్య చౌదరిని ఎన్‌డిఏ ప్రభుత్వం నియమించడంతో..విజయసాయిరెడ్డి వెంటనే అంతెత్తున లేశారు. టిటిడిలో అందరినీ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని నియమిస్తున్నారని, కమ్మమయం అందని..ఆరోపించారు. దీంతో..నెట్‌లో..గతంలో జగన్ టిటిడిని ఎలా రెడ్లమయం చేశారో పేర్లతో సహా టిడిపి సోషల్‌మీడియా బయటపెట్టి దుమ్మెత్తిపోసింది.
జగన్‌ను తిట్టించేందుకేనా...!
గతంలో..తాము చేసిన అవినీతి, అక్రమాలు, వంకరపనులు మరిచిపోయి ఇప్పుడు టిడిపిని, కమ్మ కులాన్ని విజయసాయిరెడ్డి టార్గెట్ చేయడం వెనుక ఓ వ్యూహం ఉందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు. ఆయన కావలనే కమ్మ కులాన్ని, టిడిపిని తిడతారని, ఆయన ట్విట్టర్‌లో ఏదో ఒకటి పెడతారని, దీన్ని ఆసరా చేసుకుని టిడిపి సోషల్ మీడియా రెచ్చిపోయి గతంలో..జగన్ ఆయన మందిమాగాధులు చేసిన దారుణాలన్నింటిని వెతికివెతికి బయటకు తీసి దుమ్మరేగేస్తారు. దీంతో జగన్ గత పాపాలన్నీ మరోసారి చర్చకు కారణం అవుతాయి. ఇదే విజయసాయిరెడ్డికి కావాల్సింది. తాను గిల్లి వదిలేస్తే..టిడిపి సోషల్‌మీడియా జగన్‌ను ఉతికారేస్తుంది. తన అక్రమ సంబంధాలను తాడేపల్లి ప్యాలెస్ బయటపెట్టిందన్న కక్షతోనే విజయిసాయిరెడ్డి..ప్రతిసారీ..కమ్మకులాన్ని టార్గెట్ చేస్తారని, దాంతో..వారు..జగన్‌పై పడతారనే వ్యూహంతోనే..సాయిరెడ్డి ఇలా చేస్తున్నారట. వాస్తవానికి ఆయనకు తెలియదా..గతంలో..టిటిడిలో కానీ, సిఎంఓలో కానీ, పార్టీ పదవుల్లో కానీ, కీలకమైన ప్రభుత్వ పదవుల్లో కానీ..ఎవరెవరినీ తాము కూర్చోబెట్టింది..? తమ సంగతి తెలిసే..ఎదుటివాడిని అంటే..వాడు రెండింతలు అంటాడు కదా...? అన్నీ తెలిసే..జగన్ పాపాలు జనం అంత త్వరగా మరిచిపోకూడదనే..భావనతోనే.. విజయసాయిరెడ్డి.. అలా..కమ్మ... అంటూ హడావుడి చేస్తారు. వాస్తవానికి ఆయనకు అంత కుల ఫీలింగ్ లేదంటారు. ఆయన మరదలి కూతురు తారకరత్నను పెళ్లాడింది. తారకరత్న చనిపోయిన తరువాత...ఆ కుటుంబాన్ని విజయసాయిరెడ్డి..ఆదుకున్నారంటూ..ఏవో యూట్యూబ్ ఛానెల్స్ చెబుతుంటాయి. దీనిలో ఎంత నిజం ఉందో లేదో కానీ..విజయసాయిరెడ్డి కమ్మలపై మాటలతో దాడి చేసేది మాత్రం జగన్‌రెడ్డిని తిట్టించడానికేనన్నదానిలో రెండో మాటలేదని స్వంత పార్టీ నేతలు కూడా అంటుంటారు.