ABN RKకు లోకేష్‌కు గొడవ...!నిజమేనా...!?
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేష్‌కు మధ్య గొడవ జరిగిందని, లోకేష్ ఆర్‌కెను దూరం పెట్టాడని, ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. ఎబీఎన్ రాధాకృష్ణ వ్యవహారశైలి లోకేష్‌కు నచ్చలేదని, ఆయన వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, వైకాపాకు చెందిన వారితో రాధాకృష్ణ అంతర్గతంగా సంబంధాలు పెట్టుకుంటున్నారని, ఆయన చాలా చులకనగా మాట్లాడుతూ అవమానిస్తున్నారనే భావన లోకేష్‌లో ఉందట దీంతో ఆయనను లోకేష్ దగ్గరకు రానీయడం లేదంటున్నారు. ఆయనతో ఎప్పటికైనా ప్రమాదమేనని భావించిన లోకేష్ ఆయనను దూరం పెట్టి, మరో ఛానెల్ యాజమాన్యాన్ని అక్కున చేర్చుకుంటున్నారని, ఆ ఛానెల్ యాజమాన్యానికి టిటిడి ఛైర్మన్‌పదవి కూడా ఇస్తున్నారనేది ఈ వార్తలు సారాంశం. మరో వైపు రాధాకృష్ణ వ్యవహారశైలి కారాణంగా ఆయనను దూరం పెట్టిన లోకేష్ ఆయన పత్రికకు యాడ్స్ కూడా ఇవ్వడం లేదట. టిడిపి యువనాయకత్వం తనతో వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర అసంతృప్తి చెందిన రాధాకృష్ణ తన పత్రికలో ఛానెల్‌లో టిడిపికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారనే ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో సాగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ...టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రజ్యోతిలో టిడిపి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐఏఎస్ అధికారుల బదిలీలపై ఆయన పత్రికలో మొదటిపేజీలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెద్ద వార్తే వచ్చింది. అప్పటికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయి కనీసం నెలరోజులు కూడా కాలేదు. కానీ ఈ వార్తను ప్రధానంగా మొదటి పేజీలో ప్రచురించడం వెనుక రాధాకృష్ణకు లోకేష్‌పై ఉన్న ఆగ్రహమే కారణమని చెబుతున్నారు. వాస్తవానికి ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరో ఈ వార్తను ప్రచురించాలని అనుకోలేదు. అయితే..రాధాకృష్ణ కల్పించుకుని ఈ వార్తను పెట్టించారంటున్నారు. అదే కాదు..ప్రతిరోజూ..ఏదో ఒక వార్త ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తోంది. ఈరోజు వచ్చిన వీకెండ్ కామెంట్‌లో కూడా చంద్రబాబు అసమర్ధుడన్నట్లుగా ఒక వ్యాఖ్య చేశారు. అయితే..ఇది యధాలాపంగా చేసిందా..లేక..కావాలని చేసిందా..అనేది తెలియదు.
ఎన్నికల ముందు వరకూ.. ఇంకా చెప్పాలంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతికి వచ్చిన దగ్గర నుంచి ఆ పత్రిక టిడిపికి అనుకూలమైనదనే వాదన ఉంది. అంతే కాదు..చంద్రబాబే..తన సొమ్ములతో ఆ పత్రికను కొనిపించారని చంద్రబాబు ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటారు. నిజానిజాలు భగవంతుడికే తెలియాలి.కానీ..ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణ తీసుకున్న తరువాత..అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. అంతే కాదు..అప్పట్లో పాదయాత్ర చేస్తోన్న వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత ప్రాధాన్యతను ఆంధ్రజ్యోతి ఇచ్చింది. అయితే..తరువాత..కాలంలో అది చంద్రబాబుకు అనుకూలంగానే ఉంది. అప్పటి నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకూ టిడిపిని అధికారంలోకి తేవడానికి తీవ్రంగా శ్రమించింది. అయితే..అధికారం టిడిపి కూటమికి దక్కిన దగ్గర నుంచి..ఎందుకో వ్యతిరేక వార్తలకు ప్రాధాన్యత ఇస్తోంది. లోకేష్‌తో సరిపడకే రాధాకృష్ణ వ్యతిరేక వార్తలు ఇస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే..రాధాకృష్ణను చంద్రబాబు దూరం చేసుకోడని, అదే విధంగా ఆర్‌కె కూడా చంద్రబాబుకు టిడిపికి దూరం అవరని, వారిద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనే భావన టిడిపి వర్గాల్లో ఉంది. లోకేష్‌కు చంద్రబాబు నచ్చ చెబుతారని, వారిద్దరిమధ్య మధ్యవర్తిత్వం చేస్తారంటున్నారు. మొత్తం మీద..లోకేష్, రాధాకృష్ణ మధ్య విభేదాలు అనే దానిపై రాజకీయవర్గాలతోపాటు, సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది.