‘ద్వారంపూడి’ అరెస్టు అయితే..‘జగన్’కు చిక్కులే...!?
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చెలరేగి అవినీతికి, అక్రమాలకు పాల్పడి నోటి దూల తీర్చుకున్న ద్వారంపూడికి ప్రస్తుత ప్రభుత్వం చుక్కలు చూపించబోతోంది. అక్రమరేషన్ మాఫియాకు ద్వారంపూడి కేంద్ర బిందువుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి కుటుంబం కాకినాడను కేంద్రంగా చేసుకుని అక్రమరేషన్ దందాను నడిపింది. అప్పట్లో ద్వారంపూడి అక్రమాలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్రస్థాయిలో పోరాడారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన అవినీతిపై విచారణ జరిపిస్తామని, అక్రమాలను వెలికితీస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కాకినాడ పోర్టును తమ అధీనంలో ఉంచుకుని ద్వారంపూడి కుటుంబ పేదలకు ఇచ్చే రేషన్‌ను వివిధ దేశాలకు తరిలించి సొమ్ము చేసుకుంది. అయితే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారంపూడిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో భారీ స్థాయిలో ద్వారంపూడి అక్రమాలకు బయటకు వచ్చాయి. దీంతో అక్రమరేషన్ కేసుల్లో ద్వారంపూడిని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడిని అరెస్టు చేస్తే..ఆ పరిణామాలు నేరుగా జగన్‌పైనే పడే అవకాశం ఉంది. అక్రమరేషన్ వ్యవహారంలో జగన్ కూడా భాగస్థుడనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ద్వారంపూడి జగన్ బినామీ అనే మాట రాజకీయవర్గాల్లో ఉంది. హైదరాబాద్‌లోని జగన్ లోటస్‌ప్యాలెస్ ద్వారంపూడి పేరునే ఉందంటారు. అదే విధంగా సాక్షి పత్రికలో కూడా ద్వారంపూడికి వాటాలు ఉన్నాయని, జగన్ ఆస్తుల్లో మెజార్టీ ఆస్తులకు ద్వారంపూడి బినామీగా ఉన్నారని, ఇప్పుడు ద్వారంపూడిని దెబ్బకొడితే..జగన్ ఆర్థికపునాదులు కొంతమేర బలహీనపడే అవకాశం ఉందని కూటమి పెద్దలు భావిస్తున్నారట. మొత్తం మీద..జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ద్వారంపూడి ఒకరు. ఆయనను కనుక అరెస్టు చేస్తే..చాలా జగన్ అవినీతి భాగోతాలు చాలా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.