పేదోడి బువ్వపై బురదేస్తోన్న జగన్ మీడియా...!?
అమ్మపెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లుంది..జగన్ వ్యవహారశైలి...! అధికారంలో ఉన్నన్నాళ్లు రాష్ట్ర సంపదను దోచేసి, పేదలపై పిడిగుద్దులు గుద్ది..అన్నపానీయాలను లాగేసిన జగన్..ఇంకా పేదవారిపై తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. తాను పెట్టకపోతే.. పోయాడు..పెట్టేవారిపై..పేదలపై తన మీడియాతో విష ప్రచారం చేయిస్తున్నారు. పేదోడి బువ్వపై నిత్యం విషం కక్కుతున్నారు. జగన్ మీడియాతో పాటు ఆయన పెంచిపోషిస్తోన్న సోషల్‌మీడియా సైన్యం అన్నక్యాంటీన్లపై బురద జల్లుతోంది. దీనికి జగన్ మాజీ మంత్రులు తాళం వేస్తుండగా, కాలకేయసైన్యం బురదజల్లుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత..రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఉన్న అన్నక్యాంటీన్లను పునరుద్దరించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్రదినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు, వివిధ చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నక్యాంటీన్లను ప్రారంభించారు. ఐదేళ్ల తరువాత పేదోడి నోటికి మళ్లీ అన్నం మెతుకులు అందుతుంటే..జగన్ కాలకేయ సైన్యం దాన్ని అడ్డుకునేందుకు అరాచక ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ముందుగా పాత అన్నక్యాంటీన్లను పునరుద్దరణ చేయడానికి ప్రభుత్వం నిధుల విడుదల చేసింది. దీనిపై జగన్ పత్రిక అంత ఖర్చు ఎందుకు...? టిడిపి తమ్ముళ్లు అవినీతి చేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టింది. క్యాంటీన్ల మరమ్మత్తుల కోసం భారీగా ఖర్చుచేశారని, దీనిలో అవినీతి జరిగిందని పెడబొబ్బలు పెట్టింది. తరువాత.. అన్నక్యాంటీన్లలో పెడుతోన్న ఆహారం నాణ్యతలేదని, పూరీలో నూనె కారుతుందని, ఇడ్లీలు బియ్యంతో చేస్తున్నారని విమర్శలు చేసింది. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలు వసూలు చేస్తున్నారని, కనీసం మూడు వేల మందికి కూడా ఆహారం పెట్టడం లేదని, ఇచ్చిన విరాళాలన్నింటినీ బొక్కేస్తున్నారని నిసిగ్గు రాతలు రాస్తోంది. వాస్తవానికి రోజుకు లక్షమంది అన్న క్యాంటీన్లలో భోజనాలు చేస్తుంటే..మూడు వేలమందికే పెడుతున్నారని జగన్ కాలకేయసైన్యం బరితెగించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతోంది. అంతేనా...చంద్రబాబు అన్నక్యాంటీన్‌లో రెండే స్పూన్‌లు భోజనం చేశారని, లోకేష్ అర ఇడ్లీ తిన్నారని, ఇంకేదేదో...ఇష్టం వచ్చిన రాతలు రాస్తూ...ప్రజలను తప్పుదోవ పట్టించడానికి జగన్ మీడియాతో పాటు యూట్యూబర్స్ కొంత మంది విషం చిమ్మేరాతలు రాస్తున్నారు. గత టిడిపి హయాంలో పేదోడి కోసం చంద్రబాబు అన్నక్యాంటీన్లు తెస్తే..జగన్ అధికారంలోకి వచ్చిన రోజే వాటిని మూసేపి పేదోడి బువ్వపై బురద జల్లాడు. రాకాసి పాలన అంతమై..మళ్లీ మంచిరోజులు వచ్చి..పేదోడికి పట్టెడన్నం దొరుకుతుంటే సహించలేని జగన్ సైన్యం పేదోడి బువ్వలో ఇసుక చల్లుతోంది. ఐదేళ్ల కాలంలో చేసిన అవినీతి, అరాచకాలకు జగన్‌ను జనం పాతరేస్తే...దాన్ని మనస్సులో పెట్టుకుని..పేదోడి బువ్వపై బురదేయడం జగన్‌కే చెల్లింది.