‘విజయ్‌కుమార్‌రెడ్డీ’ వెనక్కు రామ్మా...!?
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన సీనియర్ అధికారులకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. మద్యం, ఇసుక,డిజిటల్ కార్పొరేషన్, ఐ&పిఆర్ ల్లో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డ వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, మధుసూధన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డిలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. వీరు నలుగురు ఇప్పటికే పరార్ అయ్యారు. అయితే వీరిలో వాసుదేవరెడ్డి సీఐడీ పోలీసులకు దొరికాడని ప్రచారం జరుగుతోంది. అయితే..ఈ వార్తను సీఐడీ ధృవీకరించడం లేదు. కాగా మిగతా ముగ్గురు పరార్‌లో ఉన్నారు. వీరిలో ఐ&పిఆర్ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి పోలింగ్‌కు ముందు తన డిప్యూటేషన్ పొడిగించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. అయితే..అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించడంతో ఆయన ఎవరికీ చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు. తరువాత కొలకొతా పిఐబీలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. జగన్ ఓడిపోవడంతోనే...తనను అరెస్టు చేస్తారనే భయంతో ఆయన పరార్ అయ్యారు. ఈయన వ్యవహారంపై రాష్ట్ర అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ సాగింది. ఆయనను వెనక్కు పిలిపిస్తామని ప్రభుత్వం సభ్యులకు హామీ ఇచ్చింది. కాగా రాష్ట్ర సమాచారశాఖలో జరిగిన అవినీతిపై ఇప్పటికే ప్రభుత్వం విజిలెన్స్‌తో విచారణ చేయిస్తోంది.
అవినీతి, అక్రమాలు నిజమే...!
జగన్ పాలనలో సమాచారశాఖలో తీవ్రమైన అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ప్రభుత్వానికి తన ప్రాధమిక నివేదికను అందచేసింది. విజిలెన్స్ అధికారుల నివేదిక తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిపై మరింత లోతుగా విచారణ చేయించాలని నిర్ణయించారు. సమాచారశాఖ బడ్జెట్‌కు అదనంగా ఎందుకు బడ్జెట్ తెచ్చారు..? తెచ్చిన అదనపు బడ్జెట్ దేని కోసం కేటాయించారు..? ప్రస్తుతానికి అదనంగా వంద కోట్ల రూపాయలు అదనంగా తెచ్చారని, దీనిలోనే అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ తన ప్రాధమిక దర్యాప్తులో తేల్చింది. ఈ అవినీతిలో భాగస్వాములైన కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర కార్యాలయంలో పనిచేసే అడిషనల్ డైరెక్టర్, ఇద్దరు జెడీలు, ఇంజనీరింగ్ విభాగపు అధికారిని విజిలెన్స్ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే సంబంధిత దస్త్రాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి మీడియాకు, దాని అనుబంధ మీడియాతో పాటు, దేశంలోని వివిధ ఇంగ్లీషు పత్రికలకు ఇచ్చిన ప్రకటనలపై దర్యాప్తు చేయబోతున్నారు. వందలకోట్లు ఒకే పత్రికకు కట్టబెట్టిన వైనంపై కూడా విచారణ చేయబోతున్నారు. దీనిలో విజయ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఎంత..? ఆయనతో పాటు ఇద్దరు జెడీలు, అడిషనల్ డైరెక్టర్ పాత్రపై విచారణ జరగబోతోంది. వందలకోట్ల అవినీతిలో వీరి భాగస్వామ్యం ఎంత అనేది తేలనుంది. అదే విధంగా అవుట్‌డోర్ ప్రకటనలపై కూడా విచారణ జరగనుంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీకి ఎంత ఇచ్చారు..? వారి వద్ద ఎంత ముడుపులు తీసుకున్నారో తేల్వబోతున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో సీసీ టీవీలకు ఎన్ని యాడ్స్ ఇచ్చారు..? దీనిలో ముడుపులు ఎవరెవరికి ముట్టాయనేది విచారణలో తేలనుంది. అదే విధంగా అక్రిడిటేషన్ మంజూరులో జరిగిన అక్రమాలను కూడా నిగ్గుతేల్వబోతున్నారు. సొమ్ములు తీసుకుని భారీగా అక్రిడిటేషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఉంటే ఇళ్ల స్థలాలు ఇస్తామని అప్పటి జగన్ ప్రభుత్వం ప్రకటన చేసింది. దీన్ని ఆధారం చేసుకుని భారీగా అనర్హులకు అక్రిడిటేషన్లు ఇచ్చారని, దీనిలో సొమ్ములు చేతులు మారయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా విచారణ జరగనుంది.
విజయ్‌కుమార్‌రెడ్డిని వెనక్కు రప్పిస్తోన్న ప్రభుత్వం
చెప్పాపెట్టకుండా కొలకతాకు పరార్ అయిన విజయ్‌కుమార్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం వెనుక్కు రప్పిస్తోంది. శాఖలో జరిగిన అవినీతికి ఆయనే ముఖ్యకారకుడు కనుక ఆయనను విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలోని డీఓపీటీకి లేఖ రాయనుంది. తమ రాష్ట్రంలో జరిగిన అవినీతిలో ఆయన భాగస్వామ్యుడు కనుక ఆయనను వెంటనే ఇక్కడకు పంపించాలని కోరనుంది. విజయ్‌కుమార్‌రెడ్డి అవినీతికి ప్రాథమిక ఆధారాలు లభించినందున ఆయనపై విచారణ వేగం పుంజుకోనుంది. ఆయనతో పాటు అంటకాగిన సమాచారశాఖ అధికారుల ఆస్తుల వివరాలను విజిలెన్స్ అధికారులు సేకరిస్తున్నారు. మొత్తం మీద విజయ్‌కుమార్‌రెడ్డితో పాటు, కేంద్రకార్యాలయంలోపనిచేసే సీనియర్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఎవరినీ ఉపేక్షించరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే..అనుకున్నంత వేగంగా అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలూ ప్రభుత్వంపై ఉన్నాయి.