ముగ్గురూ రెడ్లే...!ఇదే జగన్ సామాజిక న్యాయం...!
సామాజిక న్యాయం గురించి తెగ ఇదయ్యే మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన పార్టీలో మాత్రం సామాజికన్యాయం అనేది మచ్చుకైనా కనిపించనీయరు. కానీ..ఎదుటివారిపై నిందలు వేయమంటే..మాత్రం ముందూ వెనుకా చూసుకోకుండా..ఎగబడడమే..! అధికారంలో ఉన్నప్పుడు..ముఖ్యమైన పోస్టుల్లో తన సామాజికవర్గానికి కేటాయించిన జగన్..ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా..అదే దారిలో నడుస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అయినా ఆయన తీరు మారుతుందని భావిస్తే..అదంతా ఒట్టిదేనని, తన కులానికే మళ్లీ ప్రాధాన్యత ఇచ్చుకున్నారు. కేంద్రంలో పార్టీ పార్లమెంటరీపార్టీ నాయకులుగా తన కులాన్ని నింపేసిన జగన్..పార్టీ పదవుల్లో కూడా తన కులాన్నే నింపేసుకున్నారు. ఈ రోజు నియమించిన పార్టీ ప్రధాన కార్యదర్శులను చూసుకుంటే ముగ్గురూ తన సామాజికవర్గానికి చెందిన వారే. ముగ్గురు ప్రధాన కార్యదర్శులను నియమిస్తే అందులో కనీసం ఒక్కరినైనా..బీసీని కానీ, ఎస్సీ, ఎస్టీకాని నియమించిన పాపాన పోలేదు. అధికారంలో ఉన్నప్పుడు మూడు ప్రాంతాలకు ముగ్గరు ఇన్‌ఛార్జీలను తన కులం వారిని నియమించుకున్న జగన్ ఇప్పుడు మూడు ప్రాంతాలకు ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేంపల్లి సతీష్‌రెడ్డిని నియమించుకున్నారు. పెత్తనం చేసే అవకాశం ఉన్న పోస్టులన్నీ తన సామాజికవర్గానికి ఇచ్చుకున్న గొడ్డుచాకిరీ చేసే పదవులకు మాత్రం వేరే సామాజికవర్గానికి కేటాయించారు. ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న జూపూడి ప్రభాకర్‌రావును తొలగించి సుధాకర్‌బాబును నియమించారు. అదే విధంగా బీసీ విభాగానికి ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ను నియమించారు. యువజన విభాగానికి జక్కంపూడి రాజాను, చేనేత విభాగానికి గంజి చిరంజీవిని నియమించారు.
దువ్వాడపై వేటు..!
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జగన్ వేటు వేశారు. ఆయన ఒక మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నారని ఆయన భార్యా పిల్లలు నెల రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంత రచ్చ జరిగినా..దువ్వాడపై చర్యలు తీసుకోని జగన్, ఇప్పుడు కూడా ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయన ఇన్‌ఛార్జిగా ఉన్న టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను పేరాడ తిలక్‌కు ఇచ్చారు. కాగా..తమ పార్టీలో ఎందరో నాయకులు మహిళలను వేధించినా, వారితో అనైతిక సంబంధాలు నెరిపినా, గంట..అరగంట అన్నా..సంజనా..బాగుంటుందా..? అన్నా..నగ్నంగా చాటింగ్ చేసినా చర్యలు తీసుకోని జగన్..దువ్వాడపై వేటు వేయడం ఏమిటని కొందరు వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. దువ్వాడ వారి కంటే..ఎక్కువేం చేశాడు..వారు చేసిందాట్లో..ఈయనదెంత..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే..దువ్వాడను పార్టీ నుంచి బహిష్కరించలేదని, ఆయన ఇన్‌ఛార్జి పదవిని మాత్రమే తొలగించారని, ఆయన నిరభ్యంతరంగా పార్టీలో ఉండవచ్చునని, ఇటువంటి అనైతిక చర్యలు ఎన్నైనా చేసుకోవచ్చని మరి కొందరు చెబుతున్నారు.