సమాచారశాఖకు చిన్నపత్రికలపై కక్ష ఎందుకు...!?
ఇటీవల కొంతమంది పత్రికలవాళ్లు సమాచారశాఖలో ప్రకటనలు ఇచ్చే అధికారిని కలిశామని, ఆ అధికారి వారితో మాట్లాడుతూ చిన్నపత్రికలను మరలా తనిఖీలు చేస్తామని, ఇంతకు ముందు తనిఖీలు చేసిన పత్రిక మీద కూడా మరలా తనిఖీలు జరిపిస్తామని, ఇవే కాకుండా గతంలో ఎంపానెల్‌మెంట్ అయిన పత్రికల మీద కూడా తనిఖీలు చేయిస్తామని చెప్పారి వాట్సప్ గ్రూప్‌ల్లో ఆ కలిసిన వారు పెట్టారు. ఇదేమి న్యాయం...? రాష్ట్రంలో పెద్ద పత్రికలుగా చలామణి అవుతున్న వాటి సర్క్యులేషన్ 4,5 వేలు కూడా దాటనవి ఉన్నాయి. వాటి ప్రకటనల రేట్లు స్క్వేర్ సెంటీమీటర్ వేలల్లో ఉంది. వాటి మీద ఎప్పుడైనా విచారణ చేయించారా..? చిన్న పత్రికలకు ప్రకటనలు ఇవ్వమని ఆదేశాలు వచ్చినా, రాష్ట్రంలో 4వేల పేపర్లు ఉన్నాయని, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుఅవుతుందని రాజమహళ్‌కు చేరవేసింది ఎవరు? ఆ కుట్రలో భాగంగా ఉన్న అప్పటి కమీషనర్ పారిపోగా, ఇంకా మనకు అన్యాయం చేసిన వారు శాఖలోనే ఉన్నారు కదా...?అసలు గత ఐదు సంవత్సరాలుగా సమాచారశాఖలో ప్రకటనలు చిన్నపత్రికలు, మ్యాగజైన్స్‌కు ఇవ్వడంలో మాయ జరిగింది. వారికి ఇష్టమైన వారికి ఆంధ్రప్రదేశ్‌లో పబ్లికేషన్ లేకపోయినా, తెలంగాణ పత్రికలకు ఎంతో దోచిపెట్టారు. ఇవన్నీ బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్నపత్రికలకు ప్రకటనలు విడుదల చేసింది. అయితే..ప్రకటన రేట్లకు సీలింగ్ విధించింది. ఇది ఎవరి నిర్వాకమో..తెలియదు. ఆయా పత్రికలు ఉన్న రేట్ ప్రకారం కాకుండా అందరికీ ఒకటే రేటుతో మంజూరు చేశారు. దీనితో చాలా మంది నష్టపోయారు. 4,5వేలు సర్క్యులేషన్ ఉండి పెద్ద పత్రికల పేరుతో చలామణి అవుతోన్న వారికి మాత్రం రేట్ కార్డు ప్రకారం యాడ్స్ విడుదల చేశారు. కానీ చిన్నపత్రికలకుమాత్రం సీలింగ్ విధించారు..? ఇది ఎందుకో..తెలియడం లేదు.