సోము,విష్ణువర్థన్‌రెడ్డి,యడ్లపాటిలకు నామినేటెడ్ పదవులా...?
ఒకప్పుడు జగన్‌తో అంటకాగిన రాష్ట్ర బిజెపి నేతలు కొంత మంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కావాలని అర్రులు చాస్తున్నారు. టిడిపి, బిజెపి, జనసేన పొత్తును బహిరంగంగా వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో తమకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసభ్యంగా దూషించిన వారు కూడా ఇందులో ఉన్నారు. జగన్ సొమ్ములకు ఆశపడి జగన్ భజన చేసిన ఈ నేతలు ఇప్పుడు తమకు పెద్దపీట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం డిమాండ్ మాత్రమే చేయడమే కాక, ఢిల్లీలోని బిజెపి పెద్దలతో చంద్రబాబుకు చెప్పించుకుంటున్నారు. బిజెపి నేతలకే కాకుండా ఆర్ ఎస్ ఎస్ నేతలతోనూ వీరు పైరవీలు చేయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు మూడు నెలలు అవుతున్నా..భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవుల భర్తీ ఎందుకు ఆలస్యం అవుతుందని ఒకవైపు టిడిపి, జనసేన కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. పదవుల భర్తీలో మూడు పార్టీల మధ్య అవగాహన కుదరలేదని, సంప్రదింపులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు మీడియా సమావేశంలోచెప్పారు. బిజెపి పెడుతోన్న కండిషన్ల వల్లే పదవుల పంపకం ఆలస్యం అవుతుందని ఆయన పరోక్షంగా చెప్పారు. ముఖ్యంగా కొందరు వివాదాస్పద బిజెపి నేతలకు పదవులు ఇవ్వమని బిజెపి పెద్దలు డిమాండ్ చేయడంతో చంద్రబాబు పరిస్థితి అడచెక్కలో పోక మాదిరిగా తయారైంది. ఒకప్పుడు తనను, తన పార్టీని దూషించిన విష్ణువర్థన్‌రెడ్డి, సోము వీర్రాజు, యడ్లపాటి రఘునందనరావు వంటి నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వమని ఆర్ ఎస్ ఎస్ నుంచి ఒత్తిడి వస్తోంది. వీరికి పదవులు ఇస్తే..పార్టీలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనే భావనతో చంద్రబాబు నామినేటెడ్ పదవులు పంచకుండా జాప్యం చేస్తున్నారనే ప్రచారం ఉంది. పైన పేర్కొన్న ముగ్గురికి కూడా కీలకమైన పదవులు ఇవ్వాలని ఆర్ ఎస్ ఎస్, బిజెప పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో కానీ, అంతకు ముందు కానీ వీరు కూటమి గెలుపుకు చేసిందేమీ లేదు. కూటమివైపు ఉంటూ జగన్ గెలుపుకు వీరు సహకరించారు. అటువంటి నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తే పార్టీలో, ప్రజల్లోకి ఎటువంటి సంకేతాలు వెళతాయోనన్న శంకతోనే చంద్రబాబు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆలస్యం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చర్చల పేరుతో మరికొన్నాళ్లు నాన పెట్టి, వీరికి పదవులు ఇవ్వకుండా ఉండాలనేది చంద్రబాబు ఎత్తుగడ కావచ్చు. అయితే ఆర్ ఎస్ ఎస్, బిజెపిపెద్దలు మరింతగా ఒత్తిడి చేస్తే..వీళ్లకు ఏదో ఒక పదవిని చంద్రబాబు ఇవ్వవచ్చు. గతంలో..తమ పార్టీ మద్దతుతో సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయితే..తరువాత ఆయన ఏమి చేశారో..రాష్ట్రం అంతా చూసింది. ఇటువంటి జగన్ కోవర్టులు నామినేటెడ్ పదవులు ఇస్తే కొరివితో తలగోక్కున్నట్లే...!?