జగన్‌కు షాక్ ఇచ్చిన మహిళ...!
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి అధికారం పోయిన వెంటనే ప్రజలు గుర్తుకువచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ..ఏదైనా ప్రకృతి విపత్తులు జరిగితే..వెంటనే స్పందించకుండా, వారం రోజులు తరువాత రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్లి పరామర్శపేరుతో షో చేసిన జగన్ విజయవాడ వరదలపై రాజకీయం చేయడానికి రెండో రోజే దిగబడ్డారు. ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు ఆయన బృందం పగలూ, రాత్రి లేకుండా వరదబాధితులకు సహాయం చేస్తూ..అక్కడే ఉండి..పనిచేస్తుంటే..దాన్ని వక్రీకరించి..రాజకీయం చేయాలని వచ్చిన జగన్‌కు ఓ మహిళ షాక్ ఇచ్చారు. ప్రభుత్వం మీకు ఏమీ చేయడం లేదు కదా..అంటూ జగన్ మహిళ చేత ప్రభుత్వాన్ని తిట్టించాలనే ఉద్దేశ్యంతో ఆమె అడిగారు. దానికి ఆమె బదులిస్తూ..పాపం వారు మాత్రం ఏమి చేస్తారు..పీకల్లోతు నీళ్లలో వాళ్లు అందరికీ సహాయం చేస్తూనే..ఉన్నారు. ఇంత కన్నా..ఎవరైనా ఇంకేమీ చేస్తారు..ప్రభుత్వం అందరికీ అవసరమైన సహాయం ఇస్తుందని తేల్చి చెప్పింది. దాంతో జగన్ మొహం వాడిపోయింది. తనకు అనుకూలంగా మాట్లాడుతుందేమో..ప్రభుత్వాన్ని ఏకేద్దామనుకున్న జగన్ మహిళ సమాధానంతో ఏమి చెప్పాలో తెలియక ఏదో అనుకుంటూ అక్కడ నుండి వెనుతిరిగారు. 75 ఏళ్ల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అర్థరాత్రి వరకూ బోట్‌ల్లో స్వయంగా తిరుగుతూ, వరదసహాయక కార్యక్రమాలను సమీస్తుంటే..ఓర్వలేని జగన్..హఠాత్తుగా దిగబడి..పరామర్శపేరుతో.. రాజకీయం చేయాలనే దుర్భుద్ధిని ప్రజలు బాగానే గమనించి..బుద్ది చెప్పారని టిడిపి నాయకులు అంటున్నారు. మొత్తం మీద..అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని, ప్రజలకు దూరంగా తిరిగిన జగన్..అధికారం పోవడంతోనే ప్రజలు గుర్తుకొచ్చారు. ఇదే సమయంలో తన మందిమాగాధుల చేత విజయవాడ ప్రజలను తానే కాపాడానని సోషల్‌మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. రిటైనింగ్‌వాల్ నిర్మించి విజయవాడ ప్రజలను కాపాడాడని భుజకీర్తులు తొడిగించుకునే పనిలో ఉన్నారు. వాస్తవానికి రిటైనింగ్‌వాల్‌ను టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడే మొదటుపెట్టి దాదాపు పూర్తి చేసింది. తరువాత వచ్చిన జగన్ ఐదేళ్లలో దాన్ని పూర్తి చేసి, తనపార్టీ రంగులేసి..ఇప్పుడు వరదల్లో ప్రజలు చస్తుంటే..దాన్ని పట్టించుకోకుండా..రాజకీయలబ్దికి ప్రాకులాడుతున్నాడు. ఒకప్పుడు ఆయన విన్యాసాలను నమ్మిన ప్రజలు ఇప్పుడు మాత్రం ఆయనను వినోదాత్మకంగా చూస్తున్నారు.