వైఎస్సార్ రైతు భరోసా...ఇక నుంచి అన్నదాత సుఖీభవ
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వెలగబెట్టిన జగన్మోహన్‌రెడ్డి పలు పథకాలకు తనపేరు, తన తండ్రిపేరును పెట్టేసుకున్నారు. గతంలో ఉన్న మహానుభావుల పేర్లను ఆయన అడ్డగోలుగా తొలగించారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ పెట్టిన పేర్లను తొలగిస్తోంది. దానిలో భాగంగా వ్యవసాయశాఖకు సంబంధించిన పలు పథకాలపేర్లను మార్చివేసింది. గతంలో వైఎస్సార్ రైతు భరోసాగా ఉన్న రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభన అని పేరు మార్చింది. అదే విధంగా ఇ-క్రాప్‌కు, ఇ-పంటగాను, వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలను వడ్డీలేని రుణాలుగా మార్చింది. అదే విధంగా డాక్టర్ వైఎస్సార్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా, వైఎస్సార్ యంత్రసేవ పథకం పేరును ఫార్మ్ మెకానిజం స్కీమ్‌గా, డాక్టర్ వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ లాబొరేటరీస్‌గా ఉన్న పథకానికి ఇంటిగ్రేటెడ్ అగ్రి లాబ్‌గా మార్చింది. వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రంను విలేజ్ లేక క్లస్టర్ సిహెచ్‌సిఎస్‌గాను, వైఎస్సార్ ఆప్‌ను ఫెర్‌ఫామెన్స్ మానటరింగ్ ఆప్‌గాను, రైతుభరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రంగా, ఆర్‌బికె ఛానెల్ స్టూడియోను పాడిపంటలు ఛానెల్‌గా, డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా మంత్లీ పత్రికకు పాడిపంటలు మంత్లీ మ్యాగ్‌జైన్‌గా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.