5న లండన్‌కు జగన్...!
వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి లండన్ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చినా..ఆయన పర్యటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన లండన్ పర్యటన రద్దు అయిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆయన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన లండన్ టూర్ పెట్టుకున్నారు. అనుకున్నవిధంగా అయితే..ఈపాటికి ఆయన లండన్‌లో తేలేల్సాంది. అయితే..ఆయన టూర్ ప్రకటన వెలువడిన తరువాత పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. అదే దారిలో మరికొందరు ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్‌లు, మున్సిపల్ ఛైర్మన్‌లు, వార్డు మెంబర్లు భారీ స్థాయిలో పార్టీ ఫిరాయిస్తున్నారు. ఎన్నికల ముందు వరకూ చాలా పటిష్టంగా ఉన్న పార్టీ, ఫలితాల తరువాత ఒక్కసారిగా కుదేలయిపోతోంది. పార్టీలో ఎవరు ఉంటారో..ఎవరు ఉండరో, అసలు పార్టీ ఉంటుందో..లేదో అనే అనుమానాలు ఆ పార్టీ నాయకుల్లో, అభిమానుల్లో, సానుభూతిపరుల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్ పార్టీని వదిలేసి లండన్‌కు వెళితే..ఆయన తిరిగొచ్చేసరికి పార్టీలో ఎంత మంది మిగులుతారో..? పార్టీ ఏమవుతుందో అనే శంక ఆ పార్టీలో కొందరిలో ఉంది. దీంతో తాను లండన్ వెళితే..పార్టీకి ఇబ్బంది అని భావించి, పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే..అదేమీ లేదని ఆయన ఈనెల 5వ తేదీన లండన్ పర్యటనకు వెళుతున్నారని విశ్వసనీయవర్గాలు జనమ్ఆన్‌లైన్.కామ్ కు చెప్పాయి. ఆయన లండన్ వెళ్లేది ఖాయమని, ఆయనతో పాటు కొందరు సన్నిహితులు కూడా లండన్ వెళతారని ఆ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద రద్దు అవుతుందనుకున్న జగన్ పర్యటన మళ్లీ కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ లండన్ వెళితే తిరిగి రారని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక నీరవ్‌మోడీలా, విజయ్‌మల్యాలా, నిత్యానందస్వామిలా లండన్‌లో ఒక దీపాన్ని కొనుగోలు చేసి కుటుంబంతో సహా ఆయన అక్కడే ఉంటారని వారు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తం మీద..జగన్ లండన్ పర్యటనపై ఒక స్పష్టత అయితే వచ్చింది.