వైకాపా నేతల అరెస్టుకు తొలగిన అడ్డంకి...!
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన వైకాపా నేతల అరెస్టుకు అడ్డంకి తొలగిపోయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వందలాది మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు టిడిపి రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. తమ కార్యకర్తలకు బీపీ పెరిగి దాడి చేశారని, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన పార్టీ నాయకుల ఘనకార్యాన్ని స్వాగతించారు. అయితే..రోజులు ఎప్పుడూ అలానే ఉండవు కదా..? చేసిన పాపాలకు ప్రజలు బుద్ది చెప్పడంతో..ఇప్పుడు తమను అరెస్టు చేయవద్దంటూ వైకాపా నేతలంతా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు. టిడిపి కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులుగా ఉన్న దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, జోగిరమేష్, మాజీ ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలు ఇప్పుడు అరెస్టు భయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తమకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని నిందితులు హైకోర్టులో పిటీషన్‌వేశారు. అయితే...ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. అయితే..తమను అరెస్టు చేయకుండా చూడాలని వారు హైకోర్టులో వారు పిటీషన్ వేశారు. దీనిని కూడా హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు కోర్టు అడ్డంకి లేకపోవడంతో ..పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న పైన పేర్కొన్న నాయకులనందరినీ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌లను పోలీసులు ఏ క్షణ్ణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే..విజయవాడలో భారీ స్థాయిలో వచ్చిన వరదల కారణంగా పోలీసు యంత్రాంగం అంతా అక్కడ మొహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, ఆయన మంత్రులు, అధికారులు అంతా అక్కడే నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో వీరి అరెస్టు ఇప్పుట్లో జరిగే పరిస్థితి లేదు. హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రావడంతో వీరు సుప్రీంకోర్టుకు వెళతారేమో చూడాలి. అయితే..విజయవాడలో వరద పరిస్థితి మెరుగుపడితే..వీరందరినీ పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు మొండు కనిపిస్తున్నాయి.