I&PRలో మరొకరిపై వేటు
రాష్ట్ర సమాచారశాఖలో గత జగన్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర సమాచారశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే జాయింట్ డైరెక్టర్‌పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తోన్న Regional Information Engineer (Hqrs)ను జిఎడికి అటాచ్ చేసింది. ఆయనపై అవినీతి,అక్రమాలకు, నిధుల దుర్వినియోగం, ఇతర ఆరోపణలు ఉన్నాయి. గత జగన్ ప్రభుత్వంలో సదరు RI వైకాపా ఏజెంట్‌గా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ టీవీల్లో ప్రకటనల్లో అవినీతి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇంటిలో ఏర్పాటు చేసిన వీడియో, ఆడియో సిస్టమ్స్‌ను వెనక్కు తేవకపోవడంలో సదరు ఆర్ ఐ ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయి. సమాచారశాఖ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు జగన్ గృహంలో ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో సిస్టమ్స్ దాదాపు రూ.80లక్షల విలువ చేస్తాయి. జగన్ అధికారం కోల్పోయిన తరువాత వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన సదరు అధికారి తనకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. విజయ్‌కుమార్‌రెడ్డి కమీషనర్‌గా ఉన్నప్పుడు సదరు RI తనపై అధికారిని పక్కకు తప్పించి, అంతా తానేనన్నట్లు వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా సీసీ టీవీలకు యాడ్స్ విడుదల చేసి వారి వద్దనుంచి లంచాలు తిన్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్ష్ శుక్లా వచ్చిన దగ్గర నుంచి గతంలో అవినీతి, అక్రమాలు ఎదుర్కొన్న ఒక్కో అధికారిపై చర్యలు తీసుకుంటున్నారు. కాగా మరో ఇద్దరు అధికారులపై కూడా చర్యలు ఉంటాయని, వీరు అవుట్‌డోర్ ప్రకటన్లోనూ, ఇతరత్రా ఏజెన్సీల్లో కమీషన్లు పుచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సదరు సీనియర్ అధికారులపై కూడా వేటుపడుతుందని, వీరిపై వేటు పడితే..రాష్ట్ర సమాచారశాఖ దాదాపు ప్రక్షాళన అవుతుందని జర్నలిస్టు సంఘాలు చెబుతున్నాయి. అధికారం ఉంది కదా..అని విర్రవీగిన వారినంతా కూటమి ప్రభుత్వం ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటోంది. వారి చర్యలపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.