కుటుంబరావు, టివి5 వసంత్ మధ్య సంవాదం...!
ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ బోర్డు మాజీ ఛైర్మన్ సి.కుటుంబరావు, టివి5 యాంకర్ వసంత్ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. బుధవారం ఉదయం టివి5 మార్కెట్ విశ్లేషణలో ఈ మధ్యకాలంలో వరదలా వస్తోన్న ఐపిఓల గురించి వారి మధ్య సంవాదం జరిగింది. ఐపీఓలు వల్ల సామాన్య మదుపుదారులకు మేలు జరుగుతుందని వసంత్ చెప్పగా దానితో కుటుంబరావు దాన్ని వ్యతిరేకించారు. విచ్చలవిడిగా వస్తోన్న ఐపిఓల వల్ల మదుపుదారుల సొమ్ము వెంటనే రెట్టింపుఅవుతుందని, ఐపిఓలను ఆదరించాలని వసంత్ వాదించారు. అయితే..ఐపీఓల వల్ల మదుపురులకు నష్టమే ఎక్కువ చేకూరుతుందని, గత అనుభవాల నుంచి ఇది తాను చెబుతున్నానని, వరదలా వస్తోన్న ఐపీఓల్లో దాదాపు 60శాతం నష్టాన్నే ఇస్తున్నాయని, అయితే వీటిలో కొన్ని మంచి ఐపీఓలు ఉన్నాయని కుటుంబరావు అన్నారు. చరిత్ర చూసుకుంటే ఎక్కువ ఐపీఓలు మదుపురులకు నష్టాలను ఇచ్చాయని, తాను దానికి ఆధారాలు చూపిస్తానని కుటుంబరావు చెప్పారు. దీనిలో వసంత్ పదే పదే విభేదించారు. తాను చెప్పిందే సరైనదనట్లు ఆయన వాదించారు వీరి వాదనను నెట్‌జెన్‌లు ఆసక్తిగా వీక్షించారు. కొందరు కుటుంబరావు స్టాక్‌మార్కెట్‌లో లెజెంట్ అని ఆయనతో వసంత్ వాదించడం సరికాదని విమర్శించారు. ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్‌లో వస్తోన్న ఐపీఓలు కొన్ని మంచి లాభాలనే ఇస్తున్నాయి. అయితే కొన్ని ఊరూపేరూ లేని కంపెనీలు లాభాలు ఇచ్చాయని, వాటిని అట్టిపెట్టుకున్నవారికి తరువాత ఘోరమైన నష్టాలను మిగిల్చుతున్నాయి. ఈ విషయాన్నే కుటుంబరావు గట్టిగా చెప్పారు. నాణ్యమైన కంపెనీల ఐపిఓలనే ఎన్నుకోవాలని తద్వారానే..మదుపరులకు మంచి లాభాలు వస్తాయని అన్నారు. మొత్తం మీద..నిత్యం టివి5 మార్కెట్ ఎనాలసిస్ చూసేవారికి కుటుంబరావు, వసంత్‌ల మధ్య జరిగిన సంవాదం ఆశ్చర్యాన్ని కల్గించింది. కుటుంబరావును వసంత్ పదే పదే అడ్డుకుంటున్నారని, ఆయన చెప్పేదాన్ని చెప్పనివ్వాలని వారు కామెంట్లలో కోరారు.