జగన్‌కు ఇంగితం లేదా...!?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి కొంచెం కూడా ఇంగితం ఉన్నట్లు కనిపించడం లేదు. ఒక గౌరవప్రదమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి, ఒక ప్రధాన రాజకీయపార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏమి మాట్లాడుతున్నాడో..? పక్కన ఎవరు ఉన్నారో అనే ఇంగితం లేకుండా..బజారులో వ్యక్తులు మాట్లాడినట్లు..మాట్లాడడం ఆయనకే చెల్లింది. ఆయన భాష ఎంత దిగజారుడుగా ఉంటుందో..గతంలో చూసాం. ఇప్పుడు మరోసారి ఆయన తన భాషా సౌందర్యాన్న, తనకు మాత్రమే తెలిసిన బోసిడీకే..అర్థాన్ని మరోసారి కెమెరాల సాక్షిగా బయటపెట్టుకున్నారు. మాజీ ఎంపి నందిగం సురేష్‌ను పరామర్శించడానికి గుంటూరు వచ్చిన జగన్..మరోసారి తనకు ఇంగితం లేదని నిరూపించుకున్నారు. ఒక మహిళను, అదీ మాజీ మంత్రిని పక్కన పెట్టుకుని ల....భాషను మాట్లాడడం..ఆయన దిగజారుడు వైఖరికి అద్దం పడుతోంది. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు టిడిపి కార్యాలయంపై దాడి చేయడం తప్పు కాదట. తనను తిట్టారని..వారు దాడి చేశారట. దాన్ని సమర్ధించుకోవడానికి... ఏదో ఒకటి ఏడ్వచ్చు..ఏదైనా చెప్పుకోవచ్చు...తప్పులేదు..కానీ..ఒక మహిళను పక్కన పెట్టుకుని పదే పదే బోసిడికే..అర్థం తెలుసా..అంటూ..దానికి ఈయన కనిపెట్టిన అర్థమైన ల....ను పదే పదే చెబుతూ..వికృతానందం పొందడం ఏమిటో...? లైవ్‌లో ప్రసారమైన ఆయన ల..భాషను చూసిన ఆంధ్రాజనం..ఇతన్ని ఘోరంగా ఓడించడంలో తప్పులేదు..ఆ 11కూడా ఇవ్వకుండా ఉండాల్సింది...ఇంత ఘోరమైన పదాలు ఒక రాజకీయనాయకుని నోటి నుండి పదే పదే వస్తాయా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. జగన్ వైఖరే అంత..ఆయన ముఖ్యమంత్రిగా వెలగబెట్టినప్పుడు కూడా విద్యార్ధినుల ముందు కూడా నలుగురు పెళ్లాలు..అంటూ పచ్చిగా మాట్లాడేవారు. నేడు అంతకన్నా బరితెగింపుతో..ల..భాషను ఉపయోగిస్తున్నారు. ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా ఆయనకు మాత్రం బుద్దిరాలేదు..భవిష్యత్తులో వస్తుందన్న ఆశ లేదు. తల్లీ చెల్లీని తరిమేసిన ఇటువంటి వారిని రాజకీయాలకు దూరంగా తరిమేస్తేనే..రాజకీయాల్లో..విలువలు కాస్తోకూస్తో..నిలుస్తాయి.