లేటెస్ట్

జ‌గ‌న్‌తో భ‌యం..భ‌యం...!?

మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కుట్ర‌,కుతంత్రాల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం భ‌యం..భ‌యంగా కాలం వెల్ల‌దీస్తోంద‌న్న అభిప్రాయాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో, కొంత మంది ప్ర‌జానీకంలో వ్య‌క్తం అవుతోంది. ఆయ‌నెప్పుడు ఏమి చేస్తారో...ఎటువంటి కుట్ర‌ల‌కు తెర‌లేపుతారో..అనే భ‌యం పాల‌క కూట‌మిలో ఉంది. జ‌గ‌న్ చేసే రాజ‌కీయాల‌ను చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఎదుర్కోలేక‌పోతున్నార‌ని, జ‌గ‌న్‌ను అదుపులో పెట్ట‌డంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేష్‌లు విఫ‌ల‌మ‌వుతున్నార‌నే భావ‌న రాజ‌కీయ‌విశ్లేష‌కుల్లోనూ, ప్ర‌జ‌ల్లోనూ ఉంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌క్షం రోజుల్లోనే ఆయ‌న రాష్ట్రంలో ఇద్ద‌రు వైకాపా కార్య‌క‌ర్త‌లు వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌తో చంపుకుంటే..30మంది వైకాపా కార్య‌క‌ర్త‌ల‌ను టిడిపి హ‌త్య చేశార‌ని ఢిల్లీ స్థాయిలో గ‌త్త‌ర గ‌త్త‌ర చేశారు. ఒక వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌యితే..రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న పెట్టాల‌ని జ‌గ‌న్ డిమాండ్ చేశారంటే..ఆయ‌న రాజ‌కీయాలు ఎలా ఉంటాయో..అర్థం అవుతోంది. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను ఢిల్లీ స్థాయి జ‌ర్న‌లిస్టులు న‌మ్మేప‌రిస్థితి. అంటే ఆయ‌న మేనెజ్‌మెంట్ స్కిల్స్ ఎలా ఉంటాయో..కూట‌మి ప్ర‌భుత్వానికి ఇంకా అర్థం కావ‌డం లేదు. వేల కోట్లు అవినీతికి పాల్ప‌డి కూడా జ‌గ‌న్ ఇంకా చంద్ర‌బాబునే నిందిస్తుంటారు. మ‌రోవైపు..చంద్ర‌బాబును కేసుల‌తో కొట్టేందుకు కొందరు పాత్రికేయుల ముసుగులో ఉన్న వైకాపా కార్య‌క‌ర్త‌ల‌తో హైకోర్టులో కేసులు వేయించారు. చంద్ర‌బాబుపై ఉన్న కేసుల‌న్నీ సీబీఐ, ఈడీల‌తో విచారించాల‌ని డిమాండ్ చేస్తూ చంద్ర‌బాబుకు నిత్యం చికాకులు సృష్టిస్తున్నారు.

ఇదొక్క‌టేనా...విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో మునిగిపోతుంటే..జ‌గ‌న్ క్రిమిన‌ల్ గ్యాంగ్‌లు ప్ర‌జ‌ల‌ను చంపే ప్లాన్లు వేశార‌ని తాజాగా తెలుస్తోంది. కృష్ణా బ్యారేజ్‌ను బోట్‌ల‌తో ఢీకొట్టే ప్లాన్ జ‌గ‌న్ గ్యాంగ్ చేసిందని, త‌ద్వారా ల‌క్ష‌ల మందిని చంపే ప్లాన్ వేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. వారి ప్లాన్ క‌నుక విజ‌య‌వంతం అయితే..మూడు జిల్లాల్లో ల‌క్ష‌లాది మంది చ‌నిపోయేవార‌ని, త‌ద్వారా రాష్ట్రంలో రాష్ట్రప‌తి పాల‌న పెట్టి రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నం పొందాల‌ని జ‌గ‌న్ ప్లాన్‌వేశార‌ని తెలిశాక‌, సామాన్య‌ప్ర‌జ‌ల్లోనూ, రాజ‌కీయ‌వ‌ర్గాల వెన్నులో వ‌ణుకు పుడుతోంది. ఎప్పుడు ఎటువంటి అవ‌కాశం దొరుకుతుందా..ఎక్కడ జ‌గ‌న్ రాష్ట్రంలో అగ్గిపెడ‌తాడో..అన్న భ‌యం కూట‌మిలో ఉంది. నిత్యం జ‌గ‌న్‌ను ఒక కంటితో క‌నిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూట‌మి నేతలు అంత‌రంగిక సంభాష‌ణ‌ల్లో చెబుతున్నారు. తాజాగా తిరుమ‌ల తిరుప‌తిలో జ‌ర‌గ‌నున్న బ్ర‌హ్మోత్స‌వాల్లో అల‌జ‌డి సృష్టించేందుకు ప్ర‌ణాళిక‌లు వేశార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య విజ‌య‌వాడ‌లోని అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని టిడిపి వారు ద్వంసం చేశార‌ని భారీ ఎత్తున్న ప్ర‌చారాన్ని హోరెత్తించారు. త‌ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఇత‌ర అంబేద్క‌రిస్టుల‌ను రెచ్చ‌గొట్టాల‌నే ఎత్తుగ‌డ వేశారు. అయితే..కూట‌మి ప్ర‌భుత్వం..దీన్ని స‌మ‌ర్థ‌వంతంగానే ఎదుర్కొవ‌డంతో వారి పాచిక పార‌లేదు. ఇలా ఒక‌టా..రెండా..రోజూ..ఏదో ఒక కుంప‌టి పెట్ట‌డానికి జ‌గ‌న్ గ్యాంగ్ విప‌రీతంగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. అయితే..దీన్ని కూట‌మి ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్ట‌లేక‌పోతోంది. కులాల మ‌ధ్య‌, మ‌తాల మ‌ధ్య‌, ప్రాంతాల మ‌ధ్య చిచ్చుకు జ‌గ‌న్ నిత్యం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయ‌న కుతంత్రాల‌ను ప‌సిగ‌ట్ట‌క‌పోతే..కూట‌మి ప్ర‌భుత్వం భారీ మూల్యానే చెల్లించుకోవాల్సిఉంటుంది. ఆయ‌న‌తో ప్ర‌భుత్వం నిత్యం భ‌యం..భ‌యంగానే పాల‌న‌ను సాగిస్తోంద‌నే దానిపై రెండో మాట లేదు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ