ముగ్గురు రెడ్లే..లడ్డూ నిందితులు...!?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు శ్రీవేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. కలియుగదైవంగా వారు తమ దేవుడిని పూజిస్తారు. అయితే..రాష్ట్రంలో వై.ఎస్. కుటుంబం అధికారం చేపట్టిన ప్రతిసారీ..వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేశారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అప్పట్లో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి..ఏడు కొండలు కాదు..రెండే కొండలు అంటూ..తిరుమల పవిత్రను దెబ్బతీసే చర్యలను చేపట్టారు. అయితే..ఆయన ఆకస్మిక మరణంతో ఏడు కొండలు జోలికి ఎవరూ వెళ్లలేదు. అసలు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదట్లోనే..వేంకటేశ్వరస్వామిని కించపరిచిన కరుణాకర్‌రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించారు. గతంలో వేంకటేశ్వరస్వామిని దూషించి, ఆయన చిత్రపటాన్ని కాళ్లతో తన్నిన కరుణాకర్‌రెడ్డిని ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని అప్పట్లో హిందూ సంఘాలు ప్రశ్నించాయి. అయితే..అంతులేని అధికారబలం కలిగిన రాజశేఖర్‌రెడ్డి ముందు వాటి బలం చాలకపోవడంతో..వై.ఎస్...ఆయన అనుచరులు తిరుమల కొండపై ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అయితే..కాలధర్మంతో..వై.ఎస్.కాలం చేశాక..తిరుమలలో పూర్వపరిస్థితులు వచ్చాయి. అయితే 2019 ఎన్నికల్లో మళ్లీ వై.ఎస్. వారసుడు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ తిరుమలలో అరాచకం ప్రబలింది. గతంలో కన్నా రెట్టింపు అరాచకంతో..జగన్ మనుషులను తిరుమలను నాశనం చేశారు. తిరుమల తిరుపతిని నాశనం చేసేందుకే టిటిడి ఛైర్మన్‌గా స్వంత బాబాయి వై.వి.సుబ్బారెడ్డిని జగన్ నియమించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన టీటీడీ ఛైర్మెన్‌గా వచ్చినప్పటి నుంచి పేదలకు దేవుడ్ని దూరం చేసే కుట్రకు తెరతీశారు. ఆయనకు తోడుగా తన సామాజికవర్గానికి చెందిన ధర్మారెడ్డిని ఇఓగా నియమించుకున్నారు. ఇక అక్కడ నుంచి వారు ఆడిందే..ఆట..పాడిందే పాట..అన్నట్లు ఐదేళ్లు తిరుమలను సర్వనాశనం చేశారు. భక్తులను కొండకు రాకుండా చేయడమే లక్ష్యంగా వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. అన్నదానం నుంచి, లడ్డూ నాణ్యత, దర్శటిక్కెట్ల వ్యాపారం..పెద్దల పెళ్లిళ్లలో తిరుమల లడ్డూలు పంచడం వరకూ..ఇలా ఒకటేమిటి...అన్ని విధాలుగా తిరుమలను భ్రష్టు పట్టించారు. తాజాగా బయటకు వచ్చిన జంతు కొవ్వు విషయం దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులకు దిగ్బ్రాంతి కలిగించింది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వులను కలిపారని చెప్పగానే సమాజం మొత్తం ఉలిక్కిపడింది. ఎంత దుర్మార్గులు వీరు..అంటూ..సోషల్‌మీడియాలో వేంకటేశ్వరస్వామి భక్తులు శాపనార్ధాలు పెడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. సాటి మనుషుల మనోభావాలను వారు ఇలా దెబ్బతీయవచ్చా..? అసలు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి ముందునుంచి తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే చిన్నచూపు. క్రిస్టియన్ అయిన ఆయన ఆలయఆచారాలను పాటించకుండా, వేంకటేశ్వరుని పట్ల విశ్వాసం ఉందని సంతకం చేయకుండా వందలమందితో గుంపులు గుంపులుగా ఆలయానికి వెళ్లారు. దీంతోనే..ఆయనకు ఆ ఆలయం పట్ల ఎంత చిన్నచూపో అర్థం అవుతోంది. తాజా వివాదంలో కూడా వైకాపా దబాయింపు రాజకీయాలకు తెరతీసింది. తప్పుచేసిన బహిరంగంగా దొరికినా..ఇంకా బుకాయింపులు చేస్తూనే ఉంది. ఇటువంటి బుకాయింపులు, దబాయింపులనుతట్టుకోలేకే మొన్నటి ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు కర్రకాల్చి వాతపెట్టినా వారి బుద్దిమాత్రం మారడం లేదని టిడిపి, జనసేన నేతలు విమర్శిస్తున్నారు.