సిఎంఓ అధికారికి వైకాపాతో సంబంధాలు...!?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి వైకాపా నాయకులతో సంబంధాలు నెరపుతున్నారనే అనుమానాలు బహిరంగంగా వ్యక్తం అవుతున్నాయి.ఆయనను వైకాపా ఏజెంట్‌గా టిడిపి నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆయనను సిఎంఓలోకి తీసుకున్నప్పుడే వీరంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన సతీమణి వైకాపాకు లీగల్ వ్యవహారాలు చూసుకుంటున్నారని, ఇప్పటికీ ఆ పార్టీకి ఆమె సేవలు అందిస్తున్నారని, అటువంటప్పుడు కీలకమైన సిఎంఓలో ఆయన ఉండటమేమిటని వీరు అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే..ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదేమీ పట్టించుకోకుండా ఆయనను సిఎంఓలో నియమించుకున్నారు. అయితే..ఆయన సిఎంఓలోకి వచ్చిన తరువాత ఆయన తీరు మారలేదు. వైకాపాకు చెందిన నాయకులకు తిరుమల టిక్కెట్లు ఇప్పించడంలో కానీ, ఇతర వ్యవహారాల్లో కానీ ఆయన వైకాపాకు అనుకూలంగా వ్యహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే..దీనిపై టిడిపి పెద్దలు మౌనం దాల్చుతున్నారు. కాగా రెండు రోజుల కిందట సిఎంఓకు మీడియా రిలేషన్ చూస్తారంటూ ఇద్దరు వ్యక్తులను నియమించారు. ఈ వ్యవహారంలో సిఎంఓ అధికారి కీలకంగా పనిచేశారని, దీని జీవో విడుదలలోనూ సిఎంఓ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే..ఈ జీవో విడుదలైన తరువాత..ఇది అందరి కంటే ముందే వైకాపా గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. వైకాపాకు చెందిన వాట్సప్‌గ్రూప్‌ల్లో ఈ జీవో కనిపించింది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టకముందే..ఇది ఆయా గ్రూపుల్లో కనిపించడం టిడిపి సోషల్‌మీడియాను ఆశ్చర్యానికి గురిచేసింది. వైకాపా వారికి ఇది ఎట్లా చేరిందనే దానిపై వీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిఎంఓ అధికారి వైకాపా వారితో రహస్య సంబంధాలు నడుపుతున్నారనే అనుమానాలు..దీనితో ఇంకా బలపడ్డాయి. ఇలాంటి అధికారిని సిఎంఓలో ఎలా కొనసాగిస్తున్నారో..చంద్రబాబుకు, ఆయన కుమారుడికే తెలియాలి. అయితే..వారి బలహీనతలు ఏవో ఇతనికి తెలుసనని, అవి ఆయన బయటపెడతారనే భయంతోనే వారు..ఈ అధికారిని బరిస్తున్నారనే ప్రచారం అటు టిడిపి వర్గాల్లోనూ, ఇటు సచివాలయ వర్గాల్లోనూ ప్రచారం జరుగుతోంది. నిజాలు దేవుడికే తెలియాలి.