లేటెస్ట్

ఉయ్యాలవాడలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో రోజుకు ఒక మండలం చొప్పున ప్రజా సమస్యల వేదికను  ఎంఎల్ఏ అఖిలప్రియ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఉయ్యాలవాడ మండల ప్రజా పరిషత్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక , గ్రీవెన్స్ కార్యక్రమంలో  ప్రజల వద్ద నుండి పెద్ద సంఖ్యంలో అర్జీలు రాగ స్వయంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రతి అర్జీదారుని సమస్య విని అర్జీని స్వీకరించడం జరిగింది. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఇచ్చిన ప్రతి ఒక్క వినతి పత్రాలను డైరెక్ట్ గా సీఎం క్యాంప్ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరుగుతుందనీ అక్కడి నుండే సంబంధిత అధికారులకు రావడం జరుగుతుందని అఖిలప్రియ అన్నారు. 


వినతి పత్రం ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రజల ప్రభుత్వం ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం మీతో శభాష్ అనిపించుకునే లాగా పనులు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం అన్ని చేస్తామని పార్టీలకతీతంగా పనులు చేస్తామని ప్రతి ఒక్కరూ సర్పంచులు గాని ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు  అందరూ సహకరించాలని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నిధులు పార్టీలకతీతంగా మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది... ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా మాట ఇచ్చిన ప్రకారం మెగా డీఎస్సీ వదలడం జరిగింది అలాగే గత ఐదు ఏళ్లుగా ఎలాంటి ఇండస్ట్రీలు గాని డెవలప్మెంట్ గాని చేయలేదని  ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాము అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు....మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి రుద్రవరం మండల కేంద్రంలో 1000 ఎకరాలకు పైగా  వరి పంట  నష్టపోయిందని  తెలిసింది కొన్ని అనివార్య కారణాలవల్ల ఈరోజు వెళ్లలేకపోయాను కానీ కలెక్టర్ గారితో నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని మాట్లాడడం జరిగింది కచ్చితంగా పంట నష్టం జరిగిన రైతుకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందుతుంది అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ