దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అఖిలప్రియ
ఆళ్ళగడ్డ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం ఆవరణ లో ఏర్పాటు చేసిన దీపం పథకం 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముందుగా మహిళలు ఏర్పాటు చేసిన మెప్మా సెంటర్ ను పరిశీలించి అనంతరం దీప ప్రజ్వలన చేసి దీపం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ రోజు ఈ దీపం పథకం 2.0 కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు చెప్పిన పని చెప్పినట్టుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము గతంలో వైసిపి అధికారంలోకి రావడం కోసం ఒక్కచాన్స్ ఇవ్వండి. అని ప్రజలని నమ్మించి. నమ్మి ఒక్క చాన్స్ ఇచ్చిన మనల్ని రోడ్డు పాలు చేశారు. కానీ నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆళ్లగడ్డను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పథకాన్ని పెంచి ఒకటో తారీకునే చేతిలో పెట్టించేలా చేసి ఈ గవర్నమెంట్ ప్రజల మన్ననలు పొందింది అన్నారు. మనల్ని నమ్మి ఓట్లేసిన వారికి మనం పని చేయాలి అని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అన్నారు కానీ వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం నెరవేర్చలేని హామీలు ఇచ్చారని అవహేళన చేశారు. ముందుగా వైసిపి నాయకులకే ఈ దీపం పథకం ద్వారా సిలిండర్లు అందజేయాలని చెప్పిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట అవహేళన చేసినట్లు అయింది.ఐదు సంవత్సరాల కాలంలో రూ. 13 వేల కోట్లు ఈ దీపం పథకం కింద ఖర్చు పెడుతున్నాం. ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూడా ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉన్నాం ఈ పథకం కింద 18 కోట్ల 53 లక్షల రూపాయలను ప్రతి ఏటా ఆళ్లగడ్డకు ఖర్చు చేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకొని పథకాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. సంవత్సరం గడువు లోపల లబ్ధిదారులకు 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందజేస్తాం హెచ్.పీ గ్యాస్ ఇండియన్ గ్యాస్ విసిపిఎల్ గ్యాస్ ద్వారా సిలిండర్లను అందజేయడం జరుగుతుందని అప్లై చేసుకున్న కూడా గ్యాస్ సిలిండర్లు అందలేదంటే టోల్ ఫ్రీ 1967 నెంబరును సంప్రదించమన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆపద్ధపు మాటలకే పరిమితమైందని ఆమె ఎద్దేవా చేసారు విదేశాల నుండి పరిశ్రమలు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అటు సీఎం చంద్రబాబు ఇటు ఐటి మినిస్టర్ లోకేష్ ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. నా తల్లి శోభా నాగిరెడ్డి పుట్టినరోజు నాడే ఆళ్లగడ్డలో ఓ నూతన పరిశ్రమను మొదలు పెట్టబోతున్నాం. ఈ పరిశ్రమ ద్వారా 2000 వేల మంది మహిళలకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని తెలిపారు.డిసెంబర్ 16న వందమంది మహిళలకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్లు ట్రైనింగ్ అయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తామని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు ఈ పరిశ్రమ ద్వారా రూ. 15 వేలు వేతనాన్ని ఇవ్వబోతున్నట్లు ఆమె తెలిపారు. మహిళలను చిన్నచూపు చూసే ప్రతి ఒక్కరికి మహిళ అంటే ఏంటో అర్థమయ్యేలా చేస్తానన్నారు. అన్నా క్యాంటీన్ ద్వారా మూడు పూటలా పేద ప్రజలకు భోజనం అందిస్తున్నాం...రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసి చూపిఇస్తామని ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా ఆమె కోరారు.