నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...!
హోంమంత్రి పనితీరు మెరుగుపర్చుకోవాలి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రలకు విఘాతం కలిగితే తానే హోంమంత్రి పదవిని నిర్వహిస్తానని, హోంమంత్రి అనిత తన పనితీరును మెరుగుపర్చుకోవాలని పవన్ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో లేకపోతే తానే హోంమంత్రి పదవిని తీసుకుంటానని ఆయన చెప్పారు. అధికారులు తమ తీరును మార్చుకోవాలని, వైకాపాలో ఉన్నట్లే ఇప్పుడూ ఉంటున్నారని ఆయన వారిని హెచ్చరించారు. వైకాపాలో మాదిరిగా అధికారులు వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, తాను హోంమంత్రి అయితే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే నిజాయితీగా వ్యవహరించాలని, కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శాంతిభద్రతల విషయంలో హోంమంత్రి అనిత మరింత చురుగ్గా వ్యవహరించాలని, వైకాపా పాలనలో జరిగినట్లే ఇప్పుడూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ఆయన అన్నారు. డీజీపీ, పోలీసులు తమ తీరును మార్చుకోవాలని అలా లేకపోతే తాము ఏమి చేయాలో చేస్తామని ఆయన హెచ్చరించారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రివర్గంలోని సహచర మంత్రి తీరు బాగాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. అతీ ఒక దళిత మంత్రి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం కాబోతున్నాయి.