లేటెస్ట్

నూతన బస్సుల సర్వీస్ ను ప్రారంభించిన అఖిల ప్రియ

ఆళ్లగడ్డ నుంచి కర్నూలుకు రెండు నూతన సర్వీసులను సోమవారం ఎంఎల్ఏ అఖిల ప్రియ ప్రారంభించారు. గతంలో కూడా రెండు సర్వీస్ లను ప్రారంభించి ప్రజా మన్ననలు పొందారు. కర్నూల్ వెళ్లే బస్సులు చాలా చోట్ల ఆపుతూ వెళ్తుంటే ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని నాదృష్టికి వచ్చిందని ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని స్టాపులు లేకుండా తగ్గించాలని డీఎం తో మాట్లాడారు. ఆర్.ఎం తో మాట్లాడి కచ్చితంగా ప్రయాణికులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రయాణికులకు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో బస్సు సర్వీసులన్నీ తొలగించడం జరిగిందని ఈ ప్రభుత్వం అలా ఉండదని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఇప్పటికే నాలుగు సర్వీసులు తీసుకొని రావడం జరిగిందని ఇంకా ఎన్నో సర్వీసులు తీసుకొస్తామని హైదరాబాద్ కు ఉదయం వెళ్లే సర్వీస్ లో లేవని త్వరలోనే ఉదయం పూట హైదరాబాదుకు వెళ్లడానికి బస్సును ఏర్పాటు చేస్తామని తిరుమల కు శ్రీశైలం కు వెళ్లే భక్తులకు బస్సు సర్వీసులు పెంచి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ బస్టాండ్ లో ప్రస్తుతానికి రెండు టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని కొత్తగా ఇంకో రెండు టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని ఆమె ప్రయాణికులకు తెలిపారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ