లేటెస్ట్

చాగంటికి క్యాబినెట్ ర్యాంక్ ప‌ద‌వి

ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌నక‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావుకు రాష్ట్ర స‌ల‌హాదారు ప‌ద‌వి ల‌భించింది. కూట‌మి ప్ర‌భుత్వం త‌న రెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసింది. ఈ జాబితాలో ప్ర‌వ‌చ‌నక‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావును రాష్ట్ర నైతిక విలువ‌ల స‌ల‌హాదారుగా ప్ర‌భుత్వం నియ‌మించింది. ఆయ‌న‌కు క్యాబినెట్ ర్యాంక్‌ను కూడా ఇచ్చింది. ఆయ‌న‌తో పాటు మైనార్టీ అఫైర్ స‌ల‌హాదారుగా మ‌హ‌మ్మ‌ద్ ష‌రీఫ్ కు కూడా క్యాబినెట్ ర్యాంక్ పోస్టు ల‌భించింది. స‌నాత‌న ధ‌ర్మం, నైతిక‌విలువ‌ల ప‌ట్ల అమిత‌మైన ప్రేమ‌ను క‌న‌బ‌రుస్తూ భ‌విష్య‌త్ త‌రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కం చేస్తోన్న చాగంటికి ప‌ద‌వి ఇచ్చి ప్ర‌భుత్వం ఆయ‌న‌ను అమితంగా గౌర‌వించింది. కాగా ప‌లువురు టిడిపి నాయ‌కులు కూడా రెండో విడ‌త‌లో ప‌ద‌వుల‌ను ఇచ్చింది. టిడిపి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్రాణాల‌కు వెర‌వ‌కుండా పోరాడిన ప‌ట్టాభి రాష్ట్ర స్వ‌చ్ఛ‌కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌తో పాటు జివి రెడ్డి (ఫైబ‌ర్‌నెట్ ఛైర్మ‌న్‌), ఆనం వెంక‌ట ర‌మ‌ణారెడ్డి (ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ)కి ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. ఆయ‌నతో పాటు టిడిపిలో క్రియాశీల‌కంగా ప‌నిచేసిన మ‌న్నం మోహ‌న్‌కృష్ణ (ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఛైర్మ‌న్‌)గా నియ‌మించారు. చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో ఐటి ఉద్యోగులతో క‌లిసి అలుపెర‌గ‌ని పోరాటం చేసిన తేజ్జస్వి పొడపాటికి  ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్మ‌న్ పోస్టు ద‌క్కింది. వీరితో పాటు గుడివాడ‌కు చెందిన రావి వెంక‌టేశ్వ‌ర‌రావుకు, పార్టీ కార్యాల‌యంలో క్రియాశీల‌కంగా ప‌నిచేసిన నీలాయ‌పాలం విజ‌య్‌కుమార్‌కు ఎపీ స్టేట్ బ‌యో డైవ‌ర్స‌టీ బోర్డు ఛైర్మ‌న్ ప‌దవి ల‌భించింది. మాజీ మంత్రి సుజ‌య్‌కృష్ణ రంగారావుకు ఎపీ ఫారెస్ట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్, గోనుగుంట్ల కోటేశ్వ‌ర‌రావుకు ఏపీ గ్రంధాల‌య ప‌రిష‌త్ ఛైర్మ‌న్‌, టిడిపి రైతు విభాగం అధ్య‌క్షుడు మ‌రెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డికి, ఎపీ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర్ మిష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ల‌భించింది. మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభాభార‌తి కుమార్తె గ్రీష్మాకు ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. నాటక అకాడమీ  ఛైర్మ‌న్‌గా గుమ్మడి గోపాల కృష్ణ, మాదిగ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా మాజీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి, గిరిజ‌న కోప‌రేటివ్ కార్పొరేష‌న్ ఛైర్మెన్‌గా మాజీ మంత్రి కిడారి శ్రావ‌ణ్‌, ఎసీ స్టేట్ కాపు వెల్ఫేర్ ఛైర్మ‌న్‌గా మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు, ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా డి.రాకేష్‌, మాల వెల్ఫేర్ కోప‌రేటివ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా పెద‌పూడి విజ‌య్‌కుమార్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. కాగా..చాలా మంది నాయ‌కులకు ఇంకాప‌ద‌వులు రాలేదు. వీరికి మూడోవిడ‌త‌లో ఏమైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ