నెరవేరిన మంత్రి నారాయణ కోరిక...!?
మున్సిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ కోరిక నెరవేరిందట. రెండోసారి మున్సిపల్ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన తన వద్ద పనిచేసే వారిలో ఎక్కువ మంది తమ సామాజికవర్గానికి చెందిన వారే ఉండాలని పట్టుబడుతున్నారట. ఇప్పటికే ఆయన వద్ద ఇబ్బడిముబ్బడిగా స్వంత సామాజికవర్గీయులు ఉన్నా..శాఖాధిపతులు, కమీషనర్‌లు తన కులానికి చెందిన వారు ఉండాలని పట్టుబట్టి సాధించుకుంటున్నారట. దానిలో భాగంగా ఇప్పటికే తన వద్ద మున్సిపల్‌శాఖ కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్‌సింఘాల్‌ను తప్పించారు. ఆయనపై పలువిధాలుగా ఒత్తిడి చేయడంతో..ఆయన ఇక్కడ నుండి ఢిల్లీకి వెళ్లిపోయారనే మాట అధికారవర్గాల నుంచి వస్తోందట. అనిల్‌కుమార్ సింఘాల్‌ను తప్పించిన తరువాత స్వంత సామాజికవర్గానికి చెందిన జూనియర్ ఐఏఎస్‌ను తన కార్యదర్శిగా మంత్రి నారాయణ నియమించుకున్నారని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మున్సిపల్‌శాఖ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ అధికారిని నియమిస్తారు. అయితే..తనకు కావాల్సిన వ్యక్తి కోసం మంత్రి నారాయణ ముఖ్యమంత్రిపై తీవ్ర వత్తిడి చేశారని ప్రచారం జరుగుతోంది. కాగా..ఇప్పటికే..మున్సిపల్ మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమీషనర్ కాటంనేని భాస్కర్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. కాటంనేని భాస్కర్‌ను బదిలీ చేసి..ఆ స్థానంలో తనకు నమ్మకస్తులైన వారిని నియమించుకోవాలని మంత్రి నారాయణ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే..నిజాయితీపరుడు, సమర్ధుడు, అయిన భాస్కర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు వదులుకోదలచుకోలేదు. దాంతో..ఆయనను అక్కడ నుంచి కదిలించకుండానే..మున్సిపల్ మంత్రి నారాయణ కోర్కెను ముఖ్యమంత్రి శాఖ కార్యదర్శి ద్వారా నెరవేర్చాడంటున్నారు. భాస్కర్‌ను బదిలీ చేస్తే..ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్న భావనతో ఆయనను కదిలించలేదని, ప్రతిష్టాత్మకమైన రాజధాని పనులను భాస్కర్ అయితేనే చేయగలరనే భావన ముఖ్యమంత్రిలో ఉంది. అయితే..భాస్కర్ తన మాట వినడంలేదని, తాను చెప్పిన పనులు చేయడం లేదనే గుర్రుతో ఉన్న ఆయనను బదిలీ చేయాలని నారాయణ ముఖ్యమంత్రిపై తీవ్రస్తాయిలో ఒత్తిడ చేశారు. అయితే..ముఖ్యమంత్రి కాదనడంతో..ఇప్పడు జూనియర్ అయిన అధికారిని శాఖ కార్యదర్శిగా నియమించడంతో..భాస్కర్ లీవుపై వెళ్లిపోతాడనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. కాగా ఈరోజు రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఇస్తానన్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించిన అగ్రిమెంట్ జరగబోతోంది. సీఆర్డీఏ కమీషనర్‌గా భాస్కర్ దానిపై సంతకం చేయాల్సి ఉంది. కాగా..ఆయన లీవుపై వెళితే రాజధాని నిర్మాణ పనుల్లో పురోగతి కనిపించదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో..?