లేటెస్ట్

అసెంబ్లీకీ రావాలంటే...నా ష‌ర‌తులు ఇవే...!

1. ప్ర‌తిప‌క్షనాయ‌కుడి హోదా ఇవ్వాలి.

2. డిప్యూటీ స్పీక‌ర్‌గా ఆర్ ఆర్ ఆర్ ఉండ కూడ‌దు...ఆయ‌న‌ను చూస్తే నాకు భ‌యం.

3. చంద్ర‌బాబు న‌వ్వ‌కూడ‌దు..ఈ మ‌ధ్య ఆయ‌న ఒక‌టే న‌వ్వుతున్నారు..న‌న్నుచూసేననుకుంటా...!

4. లోకేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు మొద‌టి వ‌ర‌సులో కూర్చోకూడ‌దు..వాళ్ల‌ను చూస్తే నాకు అసూయ‌.

5. నాతోపాటు..అంబ‌టి, అనిల్‌కుమార్‌యాద‌వ్‌, కొడాలి నాని, వంశీల‌ను అసెంబ్లీకి తెచ్చుకోనీయాలి.

6. నీవు దేవుడిసామి..నీవ‌నుకుంటే..అవుతుంద‌ని భ‌జ‌న చేసే మా మ‌హిళా నేత‌ను కూడా రానివ్వాలి.

7. రోజాను అసెంబ్లీకీ రానివ్వాలి...ఆమె ఉంటే..నాకు ధైర్యంగా ఉంటుంది.

8. ముఖ్యంగా హోంమంత్రి అనిత న‌వ్వ‌కూడ‌దు..ఆమె న‌వ్వితే..నాకు భ‌య‌మేస్తుంది.

9. స‌భ్యుల్లో ఎవ‌రు న‌వ్వినా...నేను అసెంబ్లీలో ఉండ‌ను.

10. గుండె ల‌బ్‌డ‌బ్..ల‌బ్‌డ‌బ్‌..అని కొట్టుకోదు..అధ్య‌క్షా..అనే మ‌హిళా నేత కూడా స‌భ‌లో ఉండాలి.

11. బూతులు తిట్టే..మా పార్టీ నాయ‌కులంద‌రినీ స‌భ‌లోకి రానివ్వాలి.

12. వీటితో పాటు..నా చుట్టూ..వంద‌మంది నేత‌లు ఎప్పుడూ కాపాలా కాయాలి.

13. అప్ప‌డ‌ప్పుడూ స‌భ‌లో నిద్ర‌పోనివ్వాలి.

పై ష‌ర‌తుల‌న్నీ అంగీక‌రిస్తే..అప్పుడు అసెంబ్లీకీ వ‌స్తా..లేదంటే..అంతే..మీ ఇష్టం..

ఇట్లు....

న‌న్ను ఓడించిన మీ అంద‌రిపై ద్వేషంతో...

మీ

మోసపురెడ్డి..సారీ..సారీ..నాపేరు కూడా మ‌ర్చిపోయా...? 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ