రూట్ మార్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్,తెలకపల్లి...!?
ఒక విజయం అన్నింటినీ మారుస్తుంది. అలానే..అధికారం కొందరిలో మార్పు తెస్తుంది. ఇన్నాళ్లూ వైకాపా, జగన్ భజన చేసిన కొందరు మేధావులు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు. ఇలా రూట్ మార్చిన వారు చాలా మంది ఉన్నా చెప్పుకోవాల్సినవారు ఇద్దరు ఉన్నారు. వారే తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ నాగేశ్వర్, కమ్యూనిస్ట్‌గా చెప్పుకునే తెలకపల్లి రవి. మొన్నటి ఎన్నికల దాకా వీరు జగన్‌ను భుజానవేసుకుని మోశారు. జగన్ ఏమి చేసినా వీళ్లకు ఇంపుగానే ఉండేది. మూడు రాజధానులన్నా, మద్యాన్ని అధిక ధరలకు అమ్మినా, ఇసుకను అమ్ముకున్నా, లక్షల కోట్ల అప్పులు చేసినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా, అక్రమాలు చేసినా ఈ ఇద్దరు మేధావులు జగన్‌ను వెనుకోసుకొచ్చేవారు. అదే మంటే..పేదలకు జగన్ సొమ్ములు పంచుతున్నారని, ఆయనే మళ్లీ గెలుస్తారని వివిధ టీవీ డిబేట్లలో వాదించేవారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే..ఎన్నికలకు ముందు ఇంకేముంది..మళ్లీ జగనే గెలుస్తారన్నట్లు మాట్లాడారు. పేదల్లో ఎక్కువ మంది ఆయనకే ఓటు వేస్తారని, సంక్షేమపథకాలు అందుకున్నవారంతా..ఆయనకే ఓట్లు వేస్తారు కనుక..ఆయన గెలుపు సునాయాసమని రోజుకో ఐదారు వీడియోలు వదిలేవారు. ఇక తెలకపల్లి రవిదీ అదేదారి. ఆయన సాక్షి, టివి9,ఎన్‌టివి, 10టివీల్లో కూర్చుని జగన్ భజన చేసేవారు. ఇలా చేసినందుకు అదేదో..రూ.10లక్షల ఖరీదు చేసే అవార్డు ఒకటి తెలకపల్లికి దక్కింది. అయితే..ఎన్నికల తరువాత..వీరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందమే అయింది. ఒకవైపు తాము గట్టిగా సమర్థించే జగన్ ఓటమి చెందడం..అది కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో..వీరు హతాశులయ్యారు. అయితే జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇది తప్పని ప్రొఫెసర్ ఒకటీ రెండూ వీడియోలు వదిలారు. అయితే..ఈ వీడియోలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో..ఆయన కొంచెం తగ్గారు. అయితే..ఇటీవల కాలంలో..ఈ పెద్దమనుషుల వైఖరి పూర్తిగా మారిపోయింది. వీరిద్దరూ ఇటీవల కాలంలో జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్ అసెంబ్లీని బహిష్కరించడం తెలివితక్కువ విషయమని, ఆయన తీరు సరికాదని తెలకపల్లి ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అదే అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. మొన్నటి దాకా రాజధాని అమరావతిపై విషం చిమ్మిన ఈ మేధావి..ఇప్పుడు రాజధాని విషయంలో జగన్ చేసింది తప్పని చెబుతున్నారు. జగన్ అమరావతిని ముంచేసి..తాను మునిగాడని ఇతగాడు ఇప్పుడు అంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ మాట చెబితే బాగుండేది. కానీ..అప్పుడు ఎందుకో...ఆయన నోరెత్తలేకపోయారు. ఇవే కాదు...పలు విషయాల్లో వారు చంద్రబాబును, లోకేష్‌లను అభినందిస్తున్నారు..పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అసలు హఠాత్తుగా వీళ్లలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో..సామాన్యులకు అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్ అండ చూసుకుని సోషల్ మీడియాలో చెలరేగిన వారి అరెస్టులు చేస్తుండంతో..ఆ అరెస్టులు తమదాకా వస్తాయన్న భయంతో వీరు రూట్ మార్చారా..? లేక జగన్ వీరితో కుదుర్చుకున్న ఒప్పందాలను క్యాన్సిల్ చేశారా..? అనే సందేహాలు సామాన్యులతో పాటు, రాజకీయవర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది.