ఇద్దరిదీ ఒకటే దారి...!?
తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకేదారిలో పయనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్నూ,మిన్నూ కానకుండా వ్యవహించిన ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, అధికారం పోయిన తరువాత నీతులు, హితోత్తులు, సుభాషితాలు చెబుతున్నారు. తాము అధికారంలో ఉండగా..ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఈ ఇద్దరు ఎవరో కాదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఒకరు కాగా..మరొకరు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిలు. ఈ ఇద్దరికీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరూ ఇష్టారాజ్యంగా ఆస్తులు పోగేసుకున్నారు. అవినీతి, అక్రమాలకు, దౌర్జన్యాలకు మారుపేరుగా నిలిచారు. ప్రశ్నించిన వారిని జైలుకు పంపడంలోనూ, తమకు నచ్చనివారి వేధించడంలోనూ వీరిదే రికార్డు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత భారీగా ఆస్తులు పోగేసుకుంటే, జగన్ మాత్రం తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వేలకోట్లు దోచేసుకున్నారు. కెసిఆర్ కుటుంబం, వై.ఎస్.జగన్ కూ మరో పోలిక ఉంది. ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు స్వంత పత్రికలు పెట్టుకుని స్వంత డబ్బా కొట్టకున్నారు..కొట్టుకుంటున్నారు. అంతేనా..ఆ పత్రికలను మీడియాను అడ్డుపెట్టుకుని..వందలాది కోట్లు దిగమింగేశారు. తమను ప్రశ్నించే పత్రికలే ఉండొద్దన్నట్లు ఇద్దరూ..ఆయా పత్రికలపై దాడి చేశారు. ఇద్దరి అవినీతి చరిత్ర, దౌర్జన్య, దుర్మార్గ చరిత్ర బహుశా ఉమ్మడి రాష్ట్రంలో అధికారం దక్కిన ఏ ముఖ్యమంత్రికీ, వారి కుటుంబానికి ఉండి ఉండదు. తెలంగాణలో కాళేశ్వరం పేరుతో వందల కోట్లు కెసిఆర్ దోస్తే..ఆంధ్రాలో ఇసుక, మద్యం, ల్యాండ్ ఒకటేమిటీ..సమస్థాన్ని జగన్ అండ్ కో దోచేశారు. అన్నింటిలో సామీప్యం ఉన్న వీరిద్దరిలో ఇప్పుడు మరో సామీప్యం కనిపిస్తోంది. అదేమంటే..అసెంబ్లీకి ఎగగొట్టడం..!
ఇద్దరూ అసెంబ్లీకి రారు...!
తెలంగాణలో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో కెసిఆర్ పార్టీ ఓటమి చెందింది. ఆయన పార్టీ కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చి ఓడిపోయింది. స్వయంగా కెసిఆర్ రెండుచోట్ల పోటీ చేస్తే ఒకచోట ఓటమి చెందారు. అయితే..ఆయన పార్టీ మాత్రం మంచి సీట్లే సాధించింది. అయితే..కెసిఆర్ మాత్రం అసెంబ్లీకి రావడానికి ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోయిన దాఖలాలు లేవు. అయితే..ఆయన పార్టీ తరుపున ఉన్న ఎమ్మెల్యేలు, ఆయన కుమారుడు, ఆయన మేనల్లుడు అసెంబ్లీలో గట్టిగానే పోరాడుతున్నారు. అయితే..ఎమ్మెల్యేగా ఉన్నకెసిఆర్ మాత్రం అసెంబ్లీలో అడుగుపెట్టడానికి ఇష్టపడడం లేదు. ఆయన అసెంబ్లీకి వస్తే..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందు తలదించుకోవాల్సి వస్తుందన్న భయమే..ఆయనను అసెంబ్లీకి రాకుండా చేస్తోంది. గతంలో..అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కెసిఆర్ హావభావాలు చూసిన వారు..ఇప్పుడు ఆయనను ఎమ్మెల్యేగా చూద్దామని ఆశపడుతున్నా..ఆయన మాత్రం..అసెంబ్లీ ముఖం చూడడం లేదు. కాగా ఆయన మిత్రుడు జగన్మోహన్‌రెడ్డిదీ అదే దోవ. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర ఓటమి చెందడంతో.. కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. అయితే..తనకు ప్రతిపక్షహోదా ఇస్తేనే..అసెంబ్లీకి వస్తానని ఆయన షరతు పెడుతున్నారు. అయితే..రూల్స్ ప్రకారం అది జరగదు...అయినా..ఆయన తనకు ప్రతిపక్షహోదా ఇస్తేనే..అంటూ...ముఖ్యమంత్రికి తగ్గకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలని షరతులు విధిస్తున్నారు. తాను అసెంబ్లీకి వస్తే..మైక్ ఇవ్వరంటూ..ముందే..ఏదేదో.. ఊహించుకుంటున్నారు. అయితే..అసెంబ్లీకి వస్తే..టిడిపి,జనసేన సభ్యులు గేలిచేస్తారనే భయంతోనే ఆయన అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. మొత్తం మీద..ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులూ ఒకే దారిలో నడుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అన్నాదమ్ముల్లా వ్యవహరించిన ఈ ఇద్దరు నేతలు..ప్రతిపక్షంలో కూడా అదే దారిలో నడుస్తున్నారు.
కొసమెరుపు:- ఇద్దరి నేతల్లో అన్ని విషయాల్లో సామీప్యం ఉన్నా...ఒక విషయంలో మాత్రం వైరుధ్యం ఉంది. అదేమంటే..దోచుకున్న సొమ్ము పంచుకోవడంలో...! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి దోచుకున్న సొమ్మును తన రక్తసంబంధీకులకు సమానంగా పంచారు. ఈ విషయంలో.. ఆయన తనవాళ్లందరినీ..ఒకే రకంగా చూశారు. అయితే..ఆంధ్రా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఆస్థి విషయంలో తల్లీ,చెల్లీకి పంచకుండా వారిపై కేసులు వేసి వేధిస్తున్నారు. దోచుకున్న సొమ్ములో తల్లికి, చెల్లికి వాటా లేదని, అంతా తనకే అంటూ కోర్టుకెక్కారు. అన్ని విషయాల్లో ఒకేదారిలోనడిచే కెసిఆర్, జగన్మోహన్‌రెడ్డిలు మాత్రం ఈ విషయంలో వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు.