మావాడు తప్పించుకుంటాడు...!
అదాని,జగన్ లంచాల భాగోతం బయటకు వచ్చినప్పటి నుంచి ఒకటే చర్చ నడుస్తోంది. అదానీ,జగన్ ఇద్దరూ తోడుదొంగలేనని, వారిద్దరూ వారి స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారనేది బహిరంగ రహస్యమేనని, ఇప్పుడు బయటపడ్డ రూ.1600కోట్ల లంచాలు పెద్ద విషయమే కాదని, లోతుగా దర్యాప్తు చేస్తే..ఇలాంటివి బోలెడు బయటపడతాయనే చర్చ జరుగుతోంది. ఒక్క సోలార్ విషయంలోనే ఇన్ని కోట్ల అవినీతి జరిగితే..ఇక పోర్టులు, విద్యుత్ మీటర్లు..ఒకటేమిటి..రాష్ట్రంలో జగన్ అదానీకి అప్పగించిన ప్రతిదానిలో అవినీతి ఉందని, వాటి అవినీతి లెక్కలు బయటకు వస్తే..కళ్లుభైర్లు కమ్మాల్సిందేననే మాట కూడా వినిపిస్తోంది. జగన్ లక్ష కోట్ల కుంభకోణాలు చేసి ఇన్నాళ్లైనా..అతనిని ఏ చట్టం ఏమీ చేయలేదని, ఇప్పుడు 1600కోట్లకు ఏమవుతుందనే భావన అందరిలో వ్యక్తం అవుతోంది. వాస్తవానికి ఇప్పుడు జగన్ ఇరుక్కున్న లంచాల కేసు సామాన్యమైనది కాదు. ఎందుకంటే అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటున్న కేసు. అదానిపై కేసు పెట్టి..అతనిని శిక్షిస్తే..జగన్‌ను కూడా శిక్షంచవచ్చు. కానీ..అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. లంచాల కేసులో జగన్‌ను శిక్షించాలంటే..ముందుగా అదానీని శిక్షించాలి...! కానీ..అదానికి అండగా ఉన్న బిజెపి అతనిపై ఈగ కూడా వాలనీయదు. అమెరికా దర్యాప్తు చేసినా..ఇంకెవడు దర్యాప్తు చేసినా..మోడీ అతనిని కాపాడుతూనే ఉంటాడు. అప్పుడే..బిజెపి పరివారం..అదాని విషయంలో..వెనకేసుకురావడం మొదలుపెట్టింది. దేశంలో అస్థిరత సృష్టించేందుకే అమెరికా ఇలా చేస్తోందని, అందుకే అదానిపై నిందలు మోపుతోందని విమర్శలు మొదలు పెట్టారు. అప్పట్లో హిడెన్‌బర్గ్ నివేదిక వచ్చినప్పుడు చేసిన దానికంటే..ఇప్పుడు మరింత దూకుడుగా అదానీని రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోడీ అదానినీ రక్షిస్తే..జగన్‌ను రక్షించినట్లే..ఎన్నివేల కోట్లు తిన్నా...ప్రజల సంపద ఎంత దోచుకున్నా..మావాడు తప్పించుకుంటాడని వైకాపా నేతలు ఈ ధీమాతోనే చెబుతున్నారు. మొత్తం మీద..మోడీ దయ ఉన్నంత కాలం తోడు దొంగలకు తిరుగేలేదు.