వీళ్లు ఇలా...వాళ్లు అలా...!?
అదానీ, జగన్ లంచాల కేసు గురించి ఇండియా నుంచి అమెరికాదాకా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వాణిజ్య వర్గాల్లో, రాజకీయవర్గాల్లో ఈ కేసు గురించి ఎక్కవ చర్చ జరుగుతోంది. తన స్వార్థం కోసం జగన్ దాదాపు లక్షకోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దారు. లంచాల సొమ్ము కోసం..ప్రజాప్రయోజనాలను పక్కకు పెట్టేశారు. అదానీ నుంచి జగన్ లంచాలు తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించినా..ఆయన పార్టీతో పాటు, ఆయన కులానికి చెందిన వారు మాత్రం ఆయనను ఇంకా సమర్థిస్తూనే ఉన్నారు. జగన్ మాత్రమే లంచాలు తీసుకున్నాడా..? చంద్రబాబు తీసుకోలేదా..? అని మొండి వాదన చేస్తున్నారు. చంద్రబాబు లంచాలు తీసుకుంటే..అప్పుడే కేసులు పెట్టి లోపల వేయవచ్చుకదా..? అంటే దానికి సమాధానం చెప్పకుండా మొండి వాదన చేస్తారు. వారి సంగతి అలా ఉంచితే..ఇప్పుడు అదానీ, జగన్‌ల లంచాలపై పార్టీలు విచిత్రమైన వాదనలు చేస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి వెనాకా ముందాడుతున్నారు. ఏమి చేస్తే ఏమవుతుందోనన్న భయంతో...ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీరికి జగన్‌పై గట్టి చర్యలు తీసుకోవాలనే కోరిక ఉన్నా..అదానీ సంగతేమిటని ప్రశ్నిస్తారు కనుక..కేసుపై పరిశీలిస్తున్నాం..ఆధారాలు చూస్తున్నాం..అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కాలాన్ని వెళ్లదీస్తున్నారు. జగన్‌ను లోపల వేసే ఆధారాలు ఉన్నా..ముందు అదానీ సంగతేమిటనే ప్రశ్న వస్తుందనే భయంతో.. వెనకాముందా డుతున్నారు. ఈ కేసులో వీరి పరిస్థితి విచిత్రంగా ఉంది. ఒకవైపు జగన్‌ను విమర్శిస్తూనే..మరోవైపు..అదానిని పల్లెత్తు మాట అనడం లేదు.
జగన్ భజన చేస్తోన్న సిపిఎం...!
నీతికి,నిజాయితీకి మారుపేరని, అవినీతి,అక్రమాలు ఎక్కడ జరిగినా ముందుంటామని చెప్పుకునే సిపిఎం నాయకులు ఈ లంచాల వ్యవహారంలో..ద్వందవైఖరిని అవలంభిస్తున్నారు. లంచాల కేసులో అదానీని శిక్షించాలంటూ..ర్యాలీలు చేస్తున్నారు. కానీ..కేసులో వందలకోట్లు లంచాలు మింగిన జగన్‌ను మాత్రం కనీసం ప్రస్తావించడం లేదు. నిన్న విజయవాడలో అదానీని శిక్షించాలని సిపిఎం నాయకులు ఆందోళన చేశారు. కానీ..ఇక్కడ కనీసం జగన్ పేరు కూడా ఎత్తలేదు. అంటే వారి దృష్టిలో అదానీ మాత్రమే అవినీతిపరుడు.. వందల కోట్లు దోచేసిన జగన్ నిజాయితీపరుడు. వాళ్ల స్వంత పత్రికలో అదానిని శిక్షించాలని కోరుతూ ఆర్టికల్ రాశారు..దానిలో మచ్చుకైనా..జగన్ పేరును ప్రస్తావించలేదు. అదానీతోపాటు సహనిందితులను శిక్షించాలట..ఇది కమ్యూనిస్టుల నీతి. పైగా జగన్ చేసుకున్న ఒప్పందాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రద్దుచేయాలట కానీ..జగన్‌పై కేసులు పెట్టవద్దంటారేమో...! ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన జగన్‌పై వీరి వెర్రి ప్రేమకు కారణాలు ఏమిటో..ఎవరికీ తెలియదు...? ఏది ఏమైనా...అదాని, జగన్‌ల లంచాల కేసులో..కూటమి జగన్‌పై విరుచుకుపడుతుంటే..కమ్యూనిస్టులు మాత్రం అదానిపై యుద్ధం చేస్తున్నారు. ఇదేం వైఖరో...?