బాలినేని మంత్రి పదవి అందుకే ఊడిందా...!?
జగన్, అదానీల లంచాల కేసులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అప్పట్లో సౌరవిద్యుత్ ఒప్పందాలు సమయంలో బాలినేనే మంత్రిగా ఉన్నారు. అర్థరాత్రి లేపి..అదానీ కంపెనీలకు విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకున్న దస్త్రంపై సంతకాలు చేయాలని జగన్ ఒత్తిడి చేశారని, అయితే..అర్థరాత్రి సంతకాలు ఏమిటి..? అనే అనుమానంతో..తాను ఆ దస్త్రాలపై సంతకాలు చేయలేదని, దీనిలో ఏదో జరుగుతోందని అప్పుడు భావించానని, వారు..మంత్రి మండలిలో హడావుడిగా విద్యుత్ ఒప్పందాలను ఖరారు చేశారని బాలినేని చెబుతున్నారు. అప్పట్లో ఇన్ని వందలకోట్లు చేతులు మారినట్లు తనకు తెలియదని, దీని వెనుక ఏదో ఉందనే భావనతోనే సంతకాలకు నిరాకరించానని ఆయన చెబుతున్నారు. అయితే..దీన్ని మనస్సులో పెట్టుకునే..సన్నిహిత బంధువైనా, తన కోసం ఎంతో చేసినా..జగన్మోహన్‌రెడ్డి అవేమీ పట్టించుకోకుండా మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తరువాత అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు, పాదయాత్ర చేసినప్పుడూ..బాలినేని తన వంతు పాత్ర పోషించారు. పైగా దగ్గర బంధువు అయినా. బాలినేనిని ఎటువంటి కారణం లేకుండా మంత్రి పదవి నుంచి జగన్ తప్పించారు.
అప్పట్లో బాలినేనిని ఎందుకు మంత్రి పదవి నుంచి తప్పించారో..ఎవరికీ అర్థం కాలేదు. స్వంతపార్టీ నేతలకు, కార్యకర్తలకు, సానుభూతిపరులకు జగన్ చర్యలు అర్థం కాలేదు. దీనిలో ఏదో ఉంది..మనోడు..ఏదో ఎత్తేశాడు..స్వంత బంధువును కూడా మంత్రివర్గం నుంచి పీకేశాడంటే.. టిడిపికి షాక్ ఇచ్చే పెద్ద స్కెచ్ వేసేఉంటాడు..అందుకే..బాలినేని లాంటి వాడిని కూడా తొలగించాడని వారు భావించారు. అయితే..అసలు కిటుకేమిటో..ఇప్పుడు తెలిసిపోయింది. ముందు సొమ్ములు..తరువాతే..వాడు తండ్రైనా..తల్లైనా..చెల్లైనా.. బంధువైనా..? తనకు సొమ్ములు వచ్చే ఫైల్‌పై సంతకం పెట్టమంటే..నీల్గుతాడా..? సొమ్ములు నీవు సంతకం పెట్టకపోతే..ఆగుతాయా..? నీ సంగతి తేలుస్తా...? నీల్గుతాడా..? సొమ్ములు నీవు సంతకం పెట్టకపోతే..ఆగుతాయా..? నీ సంగతి తేలుస్తా...? అంటూ బాలినేనిని మెడపట్టుకు గెంటేశాడు జగన్. సొమ్ముల కోసం స్వంత చెల్లినీ, తల్లినీ రోడ్డుమీదకు లాగిన జగన్ బాలినేని వదిలిపెడతారా..? లంచాల సొమ్ముకు అడ్డుపడడమేకాక, దానిలో వాటా అడిగితే..మండదా.. అక్కా...? మండదా.. తల్లీ… మండదా…. తమ్ముడూ..మండదా..అన్నా...?