ఎమ్మెల్యే అఖిలప్రియకు న్యాయవాదుల సన్మానం
అసెంబ్లీలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొని రావాలని తీర్మానం చేసిన సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణ ప్రముఖ న్యాయవాదులు అందరు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆమె నివాసంలో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. ప్రాంతాలకు అతీతంగా శాసనసభ్యులు కర్నూలులో బెంచ్ ఏర్పాటును హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు. దీంతో తీర్మానం ఏకగ్రీవం ఆమోదం పొందిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అసెంబ్లీ తీర్మానం కాపీని త్వరలో హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ న్యాయవాదులు అందరితో మాట్లాడుతూ ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకుని రావాలని కచ్చితంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్లు సిరివెళ్ల రమణయ్య, శివప్రసాద్, లక్ష్మిరెడ్డి, రమాదేవి, లతా,తదితరులు పాల్గొన్నారు.