లేటెస్ట్

అధికార ప‌క్ష‌మూ మేమే...ప్ర‌తిప‌క్ష‌మూ మేమే: అఖిల‌ప్రియ‌

ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే అఖిలప్రియ తన స్వగృహంలో మినీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ...  ఏవైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని విద్య ఉద్యోగం అభివృద్ధి రైతాంగ సమస్యల పట్ల మాట్లాడటం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్రలో మేమే పాలకపక్షపాత్ర లో మేమే ఉండి ప్రతిపక్షం లేకపోయినా ఆపాత్ర కూడా మేమే పోషించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపున నడిపించాలని ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు జరిపామన్నారు. ఆళ్లగడ్డలో ఏ ఏ సమస్యలు అయితే నా దృష్టికి వచ్చాయో వాటిని సంబంధిత మంత్రులతో మాట్లాడాను. అన్నారు మన ప్రాంతంలో ఇంకా ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ లు, కరెంటు పోల్స్ ,వాటికి సంబంధించిన మెటీరియల్స్ మాత్రమే కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆమె కోరినట్లు తెలిపారు. అలాగే గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా సిబ్బంది కొరతతో పాటు కొన్ని మిషనరీలు కూడా అవసరమని మూడు కోట్ల రూపాయలతో మిషనరీ కూడా ఏర్పాటు చేసేందుకు చర్చించామన్నారు. సి.పి.డబ్ల్యూ.ఎస్. స్కీము ద్వారా త్రాగునీరు శ్రీరంగాపురం దగ్గర ఆగిపోవడం జరిగింది, దాని గురించి పెద్దలతో మాట్లాడి దీనిని మరల ప్రారంభించేందుకు ఏర్పాటు చేశామన్నారు. తెలుగు గంగ నుండి రైతులకు చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విధంగా చెప్పటం జరిగిందన్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు అహోబిలంలో రోప్ వే సాంక్షన్ చేపించానన్నారు. అయితే వైయస్ఆర్ ప్రభుత్వంలో దానిని పట్టించుకోలేదని ఇప్పుడు మరల మొదలు పెట్టేందుకు మంత్రిని కోరానని తెలిపారు. ఆళ్లగడ్డ ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారం గా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నానని ఇప్పటికే ఎనిమిది కంపెనీలతో మాట్లాడి 68 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించానని ఇంకా రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి మరియు లోకేష్ గారితో మాట్లాడి మరిన్ని కంపెనీలు ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా మాట్లాడమని అన్నారు. లాఅండ్ ఆర్డర్ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే వైసీపీ వాళ్లు ప్రెస్ మీట్ లు పెట్టి ఆళ్లగడ్డ సమస్యలు వదిలేసి రాష్ట్ర సమస్యల గురించి అఖిలమ్మ మాట్లాడుతుందంటూ ఎద్దేవా చేశారని, నేను విజయవాడలో అసెంబ్లీలో ఉండి ఆళ్లగడ్డ నియోజకవర్గం లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమస్యల గురించి తెలుసుకుంటూ మాట్లాడుతుంటే మీరు ఇక్కడ ఉండి చాగలమర్రిలో బాలికపై జరిగినటువంటి సంఘటన మీకు తెలిసి మీరేం పీకారూ అంటూ ఆమె ధ్వజమెత్తారు. మాపై మీరు ఏదైనా వేలెత్తి చూపేటప్పుడు పూర్తి ఆధారాలతో ఉంటే చూపండి అలాకాకుండా మీ ఇష్టం వచ్చినట్లు ప్రెస్ మీట్ లు పెట్టి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ కూర్చోవడానికి మేం పిచ్చోళ్ళం కాదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆళ్లగడ్డలో ఏదో జరుగుతోందని మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం తగదని అలాంటి వారి పైన చర్యలు తప్పవని ఆమె అన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ