‘వేణుస్వామి’ ఎక్కడ...!?
జ్యోతీష్యం..భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో..తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి అది అంతులేని సబ్జెక్ట్. కొంత మంది నమ్ముతారు..కొంత మంది నమ్మరు..కొందరు దీన్ని శాస్త్రంగా భావిస్తుండగా మరి కొందరు మాత్రం అది మూఢ నమ్మకంగానే పరిగణిస్తారు. సరే..ఎవరి నమ్మకాలు వారివి..అయితే ఇటీవల కాలంలో జ్యోతీష్యాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ..తాము చెప్పిందే జరుగుతుందని, తాము చెపితే తిరుగులేదని వాదిస్తూ కాలం వెళ్లదీయడంతో పాటు..కాసులు కూడా బాగానే సంపాదించుకుంటున్నారు. ఈ మధ్య వీరు కొన్ని రాజకీయపార్టీలను లక్ష్యంగా చేసుకుని..ఆయన అది చేయలేదు..ఈయన ఇది చేయలేదు..అందుకే అలా జరిగింది..అంటూ భాష్యాలు చెపుతున్నారు. వీరికి నచ్చిన వారికి మాత్రం వారి జాతకం బ్రహ్మాండంగా ఉంది..రాబోయే సవర్ణయుగమని, వారికి తిరుగులేదని, రారాజులు అవుతారంటూ పల్లకీలు మోస్తున్నారు. తెలుగునాడులో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రాలో కొంత మంది జ్యోతిష్యం పేరు చెప్పుకుని..రాజకీయనాయకుల ప్రాపకం సంపాదించుకుని వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. కొందరు జ్యోతిష్యులను చూస్తే వారు..ఏమి చెబుతారో కూడా నెట్‌జెన్‌లు ముందే అంచనా వేస్తున్నారు. అంతే కాదు..వారు ఏ పార్టీకి చెందిన జ్యోతిష్యవేత్తే ముందుగానే చెప్పేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన తనయుడు ‘కెటిఆర్’, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డిలు అంటే వీరికి వల్లమాలిన అభిమానం. వారు రాజకీయంగా ఎంత క్లిష్టపరిస్థితుల్లో ఉన్నా, ఎంత అవినీతి, దుర్మార్గాలకు,దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడినా..మళ్లీ వారే..ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతారని సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటారు. వాళ్లు ఎప్పుడో ఒకసారి చెప్పింది నిజమైందని, పదే పదే..అసత్యాలను అలవోకగా జ్యోతిష్యం పేరుతో ప్రజల మనస్సులో నాటడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి కోవలోకి ప్రసిద్ధుడు ‘వేణుస్వామి’. ఈయనకు ‘జగన్’ అన్నా ‘కెసిఆర్, కెటిఆర్’లు అన్నా విపరీతమైన ప్రేమ, వాత్సల్యం. నిత్యం వారి జపం చేస్తూ, వారి ప్రత్యర్థులను పరోక్షంగా కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ ‘వేణుస్వామి’ అప్పుడెప్పుడు సినీనటులు ‘నాగచైతన్య, సమంత’లు వివాహం చేసుకుని విడిపోతారని చెప్పాడట. ఆయన చెప్పినట్లే వారు తరువాత విడిపోయారట. దాంతో..ఆయన తనంతటి జ్యోతీష్య బ్రహ్మ లేడంటూ..ప్రచారం చేసుకుంటున్నాడు. సరే..అప్పుడెప్పుడో..ఏదో చెప్పాడు..వారి ఖర్మ కాలి అది జరిగింది. దీంతో ఇతను వీరావేశంతో ప్రతిజ్ఞలు చేశాడు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ సాధిస్తుందని, అప్పుడు ‘కెసిఆర్’ కాకుండా నేరుగా ‘కెటిఆర్’ ముఖ్యమంత్రి అవుతారని సెలవిచ్చాడు. అలా జరగకపోతే తాను జీవితంలో ఇక జ్యోతిష్యం చెప్పనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇంకేముంది...మన ‘వేణు’ బ్రహ్మాండంగా చెప్పారని భావించి ‘కెటిఆర్’ కూడా ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు సిద్ధం చేసుకున్నాడు. అయితే మనోడి జ్యోతిష్యం బూమరాంగవడంతో..ఏమి చేయాలో తెలియక..ఎవరికీ కనిపించకుండా తిరుగుతున్నాడట.‘కెటిఆర్’ అయితే..వాడెక్కడ ఉన్నాడో పట్టుకురండి..అంటూ తన మనుషులకు చెబుతున్నాడని ప్రచారం సాగుతోంది. ‘వేణు’ ఒక్కడే కాదు..ఇలా మరికొందరు కూడా ‘కెసిఆర్, జగన్’లకు బ్రహ్మాండమైన జ్యోతిష్యాన్ని చెబుతున్నారు.వీళ్ల జ్యోతిష్యాలను నమ్మితే..ఏమి జరుగుతుందో..తెలంగాణ ఎన్నికలకు నిరూపించాయని, పదవుల్లో ఉన్నవారి ప్రాపకం కోసం..ఇలాంటి వారు తయారవుతారని, ఫేక్ జ్యోతిష్యులను నమ్మవద్దని జనవిజ్ఞానవేదిక ఎప్పుడో ప్రజలకు పిలుపుఇచ్చింది.మొత్తం మీద..‘వేణుస్వామి’ ఈ సారి ఏ అవతారంతో సోషల్‌మీడియాలో ప్రత్యక్షం అవుతారో చూడాలి మరి.