లేటెస్ట్

బ్ర‌ద‌ర్ జ‌గ‌న్‌..ఆ వ్యూహాలు ప‌నిచేయ‌వు...!

మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చూడ‌డానికి తింగ‌రి..తింగ‌రిగా,వెర్రిచూపుల‌తో, అదోర‌క‌మైన హావ‌భావాల‌తో,  అమాయ‌కంగా క‌నిపిస్తారు. నోట్లో వేలు పెడితే...కొర‌క‌లేడేమో...? వ్యూహాలు,కుట్ర‌లు, కుతంత్రాలు,మోసాలు... తెలియ‌వేమో..సుబ్బిని..సుద్ద‌పూస‌ని అన్న‌ట్లుంటారు. కానీ..ఆయ‌న ఎత్తేస్తే..న‌ల‌భైయేళ్ల ఇండ‌స్ట్రీ అని చెప్పుకునే చంద్ర‌బాబే బిత్త‌ర‌పోతారు. గ‌తంలో..అలాంటి ఎత్తుల‌తోనే చంద్ర‌బాబును జ‌గ‌న్ చిత్తుచేశారు. ఇప్పుడూ అలాంటి ఓ ఎత్తును ఆయ‌న ప్ర‌యోగిస్తున్నారు. అయితే..నాటి పాఠంతో..నేడు చంద్ర‌బాబు..జాగ్ర‌త్త పడుతున్నారు. జ‌గ‌న్ వ్యూహాల‌కు చిక్క‌కుండా..తిప్పికొట్టేస్తున్నాడు. అయినా..జ‌గ‌న్ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతూనే ఉన్నాడు. త‌న ర‌హ‌స్య‌మిత్రులు, నేరుగా మిత్రుల‌తో..మ‌రోసారి చంద్ర‌బాబును దెబ్బ‌కొట్టేందుకు య‌త్నిస్తున్నాడు. దీనికి ఇటీవ‌ల జ‌రిగిన అదానీ విష‌యాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆయ‌నేమి చేస్తున్నాడో..త‌రువాత చెప్పుకుందాం. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏ ఎత్తుల‌తో చంద్ర‌బాబును చిత్తుచేశాడో..ముందుగా తెలుసుకుందాం. అప్ప‌ట్లో జ‌గ‌న్ వేసిన ఎత్తుల‌కు స‌మాధానం చెప్ప‌లేక చంద్ర‌బాబు ఘోర‌ప‌రాజ‌యం పాల‌య్యారు. 


ప్ర‌త్యేక‌హోదాతో....!

అదెలాంటే..2014 ఎన్నిక‌ల్లో టిడిపి, బిజెపి, ప‌వ‌న్‌లు క‌లిసిపోటీ చేసి..ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే..రెండేళ్ల‌లోనే..చంద్ర‌బాబును బిజెపి దూరం పెట్టేసింది. చివ‌ర‌కు కూట‌మి నుంచి వెళ్ల‌గొట్టేసింది. దీనికి జ‌గ‌న్ వేసిన ఎత్తులే కార‌ణం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓడిన జ‌గ‌న్ వెంట‌నే శిఖండి విజ‌య‌సాయిరెడ్డిని ఢిల్లీకి పంపించారు. అక్క‌డ నుంచి జ‌గ‌న్ ఎత్తులు శ‌ర‌వేగంగా పారాయి. ఢిల్లీలో విజ‌య‌సాయిరెడ్డి క‌నిపించిన ప్ర‌తి బిజెపి నేత కాళ్లావేళ్లా ప‌డి..వారి ప్రాప‌కాన్ని సంపాదించారు. బిజెపి అగ్ర‌నేత‌లు ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాల‌తో పేరు పెట్టి ప‌లుక‌రించేస్థాయికి ఎదిగారు. ఇక అక్క‌డ నుంచి చ‌క్రం గిర్రున తిరిగింది. జ‌గ‌న్ ఎత్తుల దెబ్బ‌కు..మోడీ, చంద్ర‌బాబు విడాకులు తీసుకోవాల్సి వ‌చ్చింది. అప్పుడు పెద్ద‌గా చేసిందేమీ లేదు. రాష్ట్రంలో త‌న సొమ్ముల‌కు అమ్ముడు పోయిన కొంద‌రిని చేర‌దీసి..ప్ర‌త్యేక‌హోదా అంశాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయించారు. అంతేనా..పార్ల‌మెంట్‌లో త‌న ఎంపీల‌తో రాజీనామా డ్రామా ఆడించారు. మేధావులు, కుహ‌నామేధావులు, సిపిఎంలోని ఆయ‌న ర‌హ‌స్య మిత్రులు ఇదే అంశంతో చంద్ర‌బాబును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒక‌వైపు వీరితో ప్ర‌త్యేక‌హోదా..అంటూ డ్రామాలాడుతూ..మ‌రోవైపు బిజెపిపెద్ద‌ల‌తో ప్ర‌త్యేక ప్యాకేజీ అంటూ చంద్ర‌బాబును బురిడీ కొట్టించారు. హోదా లేదూ..దానికి స‌మాన‌మైన ప్యాకేజీ అంటూ..చంద్ర‌బాబుతోనే ప్ర‌క‌ట‌న చేసే విధంగా బిజెపిపెద్ద‌లు, జ‌గ‌న్ లు ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌లో చంద్ర‌బాబు ఇరుక్కుపోయారు. ప్ర‌త్యేక‌హోదా ఇవ్వని బిజెపి ప్ర‌త్యేక ప్యాకేజీకీ మంగ‌ళం పాడింది. దీంతో చంద్ర‌బాబు బిజెపి నుంచి బ‌య‌ట‌కు రావాల్సిన ప‌రిస్థితి, వారిపై పోరాడాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చేశారు. ఇక్క‌డ జ‌గ‌న్ అనుకున్న వ్యూహం అనుకున్న‌ట్లు ఫ‌లించింది. బిజెపికి ఎప్పుడైతే టిడిపి బ‌ద్ద‌శ‌త్రువైందో..ఇక అక్క‌డి నుంచి జ‌గ‌న్‌కు తిరుగులేని ప‌ట్టుదొరికేసింది. దాంతోనే బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీ సాధించి విజ‌యం సాధించారు. 


ర‌హ‌స్య‌మిత్రుల‌తో..ప‌న్నాగం...!

అప్ప‌ట్లో వేసిన ఎత్తులాంటిదే..ఇప్పుడు మ‌రోసారి వేయ‌డానికి జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అదానీ, జ‌గ‌న్‌ల లంచాల విష‌యం ఇప్పుడు దేశ‌,రాష్ట్ర స్థాయిలో హోరెత్తిపోతోంది క‌దా..? జ‌గ‌న్ అదానీ నుంచి నేరుగా రూ.1700కోట్లు లంచాలు తీసుకున్నార‌ని అమెరికా ద‌ర్యాప్తు సంస్థ పెట్టిన కేసులో పేర్కొంది. దీంతో జ‌గ‌న్ దొరికిపోయార‌నే భావ‌న టిడిపిలో, ఆ పార్టీ సానుభూతిప‌రుల్లో వ్య‌క్తం అయింది. అయితే..దీంట్లో జ‌గ‌న్ దొరక్క‌పోగా..ఆయ‌నే పైచేయి సాధించారు. ఒక‌వైపు..లంచాల కేసులో అడ్డంగా దొరికినా చంద్ర‌బాబు ఆయ‌న‌ను ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. పైగా జ‌గ‌నే ఛాలెంజ్‌లు విసిరేస్తున్నారు. తాను లంచాలు తీసుకోలేద‌నే మాట‌ను ఆయ‌న ఎక్క‌డా చెప్ప‌డం లేదు..త‌న‌కు స‌న్మానాలు చేయాల‌ని, త‌న‌ను పొగ‌డాల‌ని డిమాండ్ చేస్తున్నారు. తానుచేసిన ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న త‌న ర‌హ‌స్య మిత్రుల‌తో, త‌న ఆంగ్ల మీడియా మిత్రుల‌తో డిమాండ్ చేయిస్తున్నారు. 


రంగంలోకి ఆంగ్ల మీడియా...!

నిన్న‌టి దాకా సిపిఎంలోని త‌న ర‌హ‌స్య‌మిత్రులు అదానీతో సౌర‌విద్య‌త్ ఒప్పందాల‌ను ర‌ద్దుచేయించాల‌ని డిమాండ్ చేయించిన జ‌గ‌న్, త‌న ఇంగ్లీషు మీడియా ఫ్రెండ్స్ పేప‌ర్ల‌లో కూడా ఇదే డిమాండ్ చేయిస్తున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు 25/25సీట్లు వ‌స్తాయ‌ని ఊద‌ర‌గొట్టిన ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఇప్ప‌డు అదానీ ఒప్పందాన్ని చంద్ర‌బాబు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. దీని వల్ల రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారీ న‌ష్టం వ‌స్తోంద‌ని, అర్జెంట్‌గా దాన్ని ర‌ద్దు చేయాల‌ని పేజీలకు పేజీలు వార్త‌లు వండివారుస్తోంది. జ‌గ‌న్‌తో గ‌తంలో ఒప్పందం చేసుకున్న ఈ ఆంగ్ల‌మీడియా సంస్థ జ‌గ‌న్ కు మేలు చేసేందుకే ఈ విధంగా వార్త‌లు ఇస్తోంది. అదానీతో ఒప్పందాల‌ను చంద్ర‌బాబు వీరి ఒత్తిడితో ర‌ద్దు చేసుకుంటే..కేంద్రంలోని బిజెపి పెద్ద‌ల‌కు కోపం వ‌స్తుంది. వారికి కోపం వ‌స్తే..మ‌రో శిండే..ఇక్క‌డ పుడ‌తాడు..శిండే ఉద్భ‌విస్తే..జ‌గ‌న్ ప‌ని మ‌రింత సుల‌వుతుంది. అందుకే..త‌న ర‌హ‌స్య మిత్రులతో అదానీ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయించాల‌ని డిమాండ్ల మీద డిమాండ్లు జ‌గ‌న్ చేయిస్తున్నారు. గ‌తంలో..ఒక‌సారి జ‌గ‌న్ వ్యూహంలో ప‌డి దెబ్బ‌లు తిన్న చంద్ర‌బాబు ఈసారి ఆయ‌న ఎత్తుల‌కు చిక్క‌డం లేదు. వీరు ఎంత ఒత్తిడి చేసినా..ఇంకేమీ చేసినా..అదానీ విష‌యంలో..మోడీ మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా, దూకుడుగా ముందుకు వెళ్ల‌కూడ‌ద‌నే ఒట్టును చంద్ర‌బాబు పెట్టుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎంత మంది అరిచి గీపెట్టినా..చంద్ర‌బాబు..అదానీ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయ‌డు.. ర‌ద్దుచేయ‌డు. చేస్తే..ఏమ‌వుతుందో..ఆయ‌న‌కు బాగానే తెలుసు. ఇప్పుడ జ‌గ‌న్ మ‌రో ఎత్తుగ‌డ‌ను వెతుక్కోవాల్సిందే..! ఒక‌సారి ప‌నిచేసిన వ్యూహాలు మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయ‌వు..జ‌గ‌న్ బ్ర‌ద‌ర్‌....!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ