2029లో వచ్చేస్తున్నారట...!?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి, ఆయన కేసుల్లో నెంబర్ టూ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు మళ్లీ తమ పార్టీ అధికారంలోకి వస్తుందనే భరోసా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారిద్దరూ మళ్లీ మేమే వచ్చేస్తున్నాం..మీ సంగతి చూసేస్తాం..అంటూ..అప్పుడే బెదిరింపులకు దిగేస్తున్నారు. ఒకరేమో..వచ్చేది మనమే..ఎన్నిలకు ఎప్పుడు పెట్టినా..అన్నీ గెలుస్తాం..ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందంటూ..అతి మంచితనం, అతి నిజాయితీ వల్లే ఓడిపోయామని సూక్తులు చెబుతుంటే..మరొకాయని 2029లో వస్తున్నాం..అప్పటి వరకూ చంద్రబాబు బతికుంటే..మళ్లీ జైలుకు పంపిస్తాం..అంటూ..సవాళ్లు చేస్తున్నారు.
అసలు వీళ్లకు ఏమైంది...? ఎందుకు ఇలాంటి ఆర్భాటపు, అసందర్భ ప్రకటనలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగి కనీసం ఆరు నెలలు కూడా కాకముందే..వీరు చేస్తోన్న సవాళ్లను చూసిన వారికి..వీళ్లకేమైనా అయిందా..? మానసికంగా వీళ్లిద్దరూ సరిగానే ఉన్నారా..? అంటూ చర్చించుకుంటున్నారు. మళ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగాలంటే..కనీసం నాలుగున్నర ఏళ్లు పడుతుంది. మరి ఇప్పుడే వచ్చేస్తున్నామని పదే పదే ప్రకటించడం వెనుక అర్థం ఏమిటో....? పార్టీని సమాయత్తం చేసుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేశారనుకున్నా..అది ఇప్పుడు చేయాల్సింది కాదు. అధికార పార్టీకి కనీసం ఆరు నెలలు కూడా సమయం ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తున్నారు. సరే..రాజకీయంగా ఎదురుదాడి వల్ల ఉపయోగం ఉన్నదని భావించి అలా చేస్తున్నా..ఎన్నికలపై కలవరింపులు దేనికి..? అదే విధంగా..అధికారంపై అప్పుడే..అంత యావ ఎందుకు..? మీ పాలన బాగాలేదనేగా..జనం మిమ్మలను బండకేసి కొట్టి..ప్రత్యర్ధులకు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చింది. ఇంతలోనే ఏమైంది..సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదనో..ఇంకా వేరే..ఏమైనా..విషయాల గురించి మాట్లాడితే ప్రజల్లో కాస్తాకూస్తో సానుకూలత వస్తుంది. అలా కాకుండా మళ్లీ వస్తున్నాం...అంటే..గత ఐదేళ్లలో మీరు చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి, విధ్వంసాలను ప్రజలు అప్పుడే మరిచిపోతారా..? ఇప్పుడు మీరు మళ్లీ వస్తున్నాం..అంటే..అమ్మో..మళ్లీ రాక్షసులు వస్తున్నారట..అంటూ ప్రజలు వణికిపోతున్నారు.
ఎందుకు ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాలను మళ్లీ రేపుతారు. ప్రజలకు సమయం ఇవ్వండి..? ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు మీకంటే..అరాచకం, అవినీతి, అక్రమాలు, విధ్వంసాలు చేస్తే..అప్పుడు వాళ్లే నయమని...మీ వైపు వస్తారేమో..? ఎందుకు ఈ మతిలేని ప్రకటనలు..? దీని వల్ల వచ్చే లాభం ఇసుమంతైనా లేదు కానీ..నష్టం మాత్రం తప్పకుండా ఉంటుంది. చేతకాని పాలన చేస్తున్నారని కూటమి కార్యకర్తలు, సానుభూతిపరులు చంద్రబాబు, లోకేష్‌లపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పుడు మీరు మళ్లీ వస్తున్నారంటే..ఈ అసంతృప్తి వాదులంతా..మళ్లీ చంద్రబాబు పక్కకే వెళతారు..అందుకే..జనాలకు కొంత టైమ్ ఇవ్వండి....! ఎన్నికలకు ముందు సిద్ధం..సిద్ధం అన్నా..175/175 అన్నా..కొంత మంది వెర్రిబాగుల అభిమానులు నమ్మారు కానీ.. ఈసారి మాత్రం మిమ్మలను అంత తొందరగా ఎవరూ నమ్మరు. జైలు భయంతో..అసందర్భ, ఆర్భాట, నగుబాటు ప్రకటనలు చేస్తున్నారేమో....? మీకా భయమేమీ వద్దు.. మీరు లక్షల కోట్లు కొట్టేసినా, ప్రజల ఆస్తులు కొట్టేసినా, పారిశ్రామిక వేత్తల నుంచి వేల కోట్లు లంచాలు మేసినా..హత్యలు చేసినట్లు ఆధారాలు లభించినా..వేల కోట్ల బియ్యాన్ని అక్రమంగా అమ్ముకున్నా..ఒకటేమిటి..? మీరేమీ చేసినా..మిమ్మలను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు జైలుకు పంపరు.. పంపరు...? ఆయనకు అంత ధైర్యం లేదులే...! కానీ ఒకే ఒకమాట మాత్రం అనవద్దు. అదే... అతి మంచితనం, అతి నిజాయితీ అని ప్లీజ్.. ప్లీజ్...!