ఇద్దరూ..ఇద్దరే...!
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒకే దారిలో నడుస్తుంటారు. అధికారంలోకి వచ్చేదాకా..ఒక మాట..వచ్చిన తరువాత..మరో మాట. ఒక్కసారి అధికారం ఇవ్వమంటూ..ప్రజలను దేబిరించి..అధికారంలోకి వచ్చిన వీరు..అధికారం చిక్కాక ప్రజల సొమ్మును భారీగా దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా ప్రజలను బిచ్చగాళ్లగా చేశారని, వారికి ఆత్మాభిమానం లేకుండా చేసేందుకు యత్నించారనే భావన చాలా మందిలో ఉంది. ప్రజలకు బిస్కెట్లు వేసి..వీళ్లు మాత్రం దోపిడీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు..వీరి కుటుంబ సభ్యులు..కూడా దోపిడిలో వాటా ఇచ్చారు. ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు అధికార గర్వంతో విర్రవీగారు. అంతులేని ధనసంపద పోగేసి..అడ్డమైన పనులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన..ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులది ఒకే దారిలోనడిచారు. తమను వ్యతిరేకించేవారిని,విమర్శించేవారిపై ఉక్కుపాదం మోపారు. అంతేనా..ప్రజాస్వామ్యానికి మూలస్థంబమైన పత్రికాస్వాతంత్య్రాన్ని హరించారు. పైగా స్వంత పత్రికలు స్థాపించుకుని..తమ వ్యతిరేకులపై బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆ మాజీలు ఎవరో కాదు..తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు..ఒకరు కాగా..ఆంధ్రా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మరొకరు. వీరిద్దరికీ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా విషయాల్లో వీరికి సమీప పోలికలు ఉన్నాయి. అంతే కాదు..ప్రజాస్వామ్యాన్ని, పత్రికాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ..స్వంత పత్రికలకు కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. అధికారంలో ఉండీ..ఎటువంటి బెరుకు లేకుండా ఈ ఇద్దరు నేతలు స్వంత మీడియాకు వేల కోట్లు కేటాయించుకున్నారు.
తెలంగాణలో కెసిఆర్ తన పార్టీ పత్రికలైన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేతో పాటు, టీన్యూస్ ఛానెల్‌ను ఏర్పాటు చేసుకుని తన సంస్థలకు వందల కోట్ల రూపాయలను యాడ్స్ పేరిట దోచిపెట్టారు. తాను ముఖ్యమంత్రిగా ఉండి..తన పత్రికలకు వేలాది కోట్లు ఇచ్చుకుంటే...ప్రజలేమైనా అనుకుంటారనే ఇంగితం కూడా లేకుండా యధేచ్చగా, నిర్భయంగా, నిర్భీతిగా ఇచ్చేసుకున్నారు. అంతేనా..తనకు డప్పుకొట్టే మీడియాకు కూడా..ఎంగిలిమెతుకులు విధిలించారు. కెసిఆర్ బాటలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నడిచారు. ఆయన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌పార్టీ కోసమని, సోనియాగాంధీని ఒప్పించి ఆయనమీడియా సంస్థలను స్థాపించుకున్నారు. వై.ఎస్ మరణం తరువాత..జగన్ వాటిని తన ఆధీనంలో ఉంచుకుని తాను ఎదిగేందుకు ఉపయోగించుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత..తన మీడియా సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టారు. అంతే కాదు..తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంతో జీతాలు ఇప్పించి..తనకు పనిచేయించుకున్నారు. స్వతంత్య్రభారత దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా బరితెగించలేదు. ఎన్నో రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా సంస్థలు ఉన్నా..ఇంత బరితెగింపుతో వ్యవహారాలు సాగించలేదు. ఆయన సాగించిన అవినీతి..ఇప్పుడు ఆయన మాజీ అయిన తరువాత బయటకు వస్తోంది. దీనికి కారకులైన వారిపై ఇప్పటికే కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయిస్తోంది. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉండాల్సిన వీరు..ప్రజాసొమ్మును దిగమింగడంలో పోటీలు పడ్డారు. ఇటువంటి నాయకులు ప్రజలకు ఏదో ఒరిగిస్తారట. ప్రజల సొమ్ములు కొట్టేసి తమ మీడియా సంస్థలకు ఇచ్చుకున్న వీరిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.