‘పేర్ని’పై అంత ప్రేమేంటి ‘బాబూ’...!?
మాజీ మంత్రి ‘పేర్ని నాని‘ అక్రమ బియ్యం బాగోతాలపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నా..కూటమి ప్రభుత్వంలో చలనం లేదనే విమర్శలు వస్తున్నాయి. మచిలీపట్నంలో ‘పేర్ని నాని‘ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం భారీ ఎత్తున మాయమైనా... అధికారులు కానీ, రాజకీయనాయకులు కానీ ఎవరూ స్పందించడం లేదు. తొలుత మూడువేల బస్తాలు, తరువాత నాలుగువేల బస్తాలు, తరువాత ఏడు వేల బస్తాలు మాయమైనా..అధికారులు ఇంత వరకూ సరైన చర్య తీసుకున్న పాపాన పోలేదు. వేల బస్తాలను ‘పేర్ని నాని‘ కుటుంబం మాయం చేసిన వైనంపైనా..ఆశ్చర్యకరంగా అధికార కూటమి నేతలు అంతగా స్పందించడం లేదు. అధికారులు ‘పేర్ని నాని‘కి,ఆయన కుటుంబసభ్యులకు సహకరిస్తూ కేసులు నమోదు చేయకపోయినా..వీరు ప్రశ్నించడం లేదు. ఒకప్పుడు టిడిపిపైనా...ఆ పార్టీ అధినేత ‘నారా చంద్రబాబునాయుడు’పైనా, జనసేన అధినేత ‘పవన్ కళ్యాణ్’పైనా.. ‘పేర్ని నాని‘ విరుచుకుపడుతుండేవారు. జగన్ కోసం ఏమైనా చేస్తా..అంటూ..అప్పట్లో ‘పేర్ని’ రెచ్చిపోయేవారు. పైగా..కులాలను రెచ్చగొట్టడానికి బహిరంగంగా..‘పవన్’ మా కులం వాడు..మేమూ.. మేమూ..ఏమైనా అనుకుంటాం..అంటూ..వెకిలిగా మాట్లాడేవారు. ధర్మసూక్తులు, నీతినిజాయితీల గురించి గంటల కొద్ది ప్రసంగాలు దంచేవారు. అవకాశం దొరికితే..టిడిపి,జనసేనలను ఏకిపారేసేవారు. అటువంటి ‘పేర్ని’ అడ్డంగా దొరికినా..కూటమి నేతలు ఆయనను పళ్లెత్తు మాట అనడం లేదు. మచిలీపట్నానికే చెందిన మంత్రి ‘కొల్లు రవీంద్ర’ అయితే ‘పేర్ని’ని తమల పాకులతో కొడుతున్నారు. ఇక ఆ పార్టీకి చెందిన ఇతర నేతలూ..‘పేర్ని’ విషయంలో ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు.
‘పేర్ని’ని కాపాడుతోన్న అదృశ్యశక్తి....!
ఒకప్పుడు తమను అడ్డగోలుగా వేధించిన ‘పేర్ని’పై వీళ్లకు అంత ప్రేమేమిటో తెలియక పార్టీ కార్యకర్తలు,దిగువస్థాయి నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు వీళ్లు ‘పేర్ని’ అడ్డంగా దొరికినా..కేసులు పెట్టి జైలుకు పంపడం లేదు..పైగా ఆయనకు ఎందుకు సహకరిస్తున్నారో..వారికి అర్థం కావడం లేదు. ఈ విషయంలో ఆయనను ఏదో శక్తి కాపాడుతోందనే భావన కృష్ణాజిల్లా టిడిపి కార్యకర్తల్లో నెలకొంటోంది. ఎవరు..ఆశక్తి..అనేది..వారికి అర్థం కావడం లేదు. కులాన్ని అడ్డం పెట్టుకుని ‘పేర్ని’ బతికిపోతున్నారా...? లేక అదే కులానికి చెందిన పార్టీలోచేరతానని ఆయన హామీ ఇచ్చినందునే ఆయనపై, ఆయన కుటుంబంపై అధికారులు పెద్దగా స్పందించడం లేదా...? అనేదానిపై స్పష్టత లేదంటున్నారు దిగువస్థాయి నాయకులు. వాళ్ల సంగతి అటుంచితే..ఒకప్పుడు ‘కొల్లు రవీంద్ర’పై అక్రమకేసులు పెట్టి జైలుకు పంపించినా..ఇప్పుడు ‘కొల్లు’ ఎందుకు స్పందించడం లేదు..ఈ రేషన్ బియ్యం కేసుల్లో దూకుడును ఎందుకు ప్రదర్శించడం లేదనే ప్రశ్న పలువర్గాల నుంచి వస్తోంది. ‘చంద్రబాబు’ వలే..ఈయన కూడా..వ్యవహరిస్తున్నారా..? లేక కుమ్మక్కు రాజకీయాలు నడుపుతు న్నారా..? అర్థం కావడం లేదంటున్నారు. మొత్తం మీద..‘పేర్ని’పై కూటమి నాయకుల అవాజ్యప్రేమ చూసి...‘పేర్ని’పై ఇంత ప్రేమింటి బాబూ..అంటూ అసలైన కార్యకర్తలు నిట్టూర్పులిడిస్తున్నారు.