లేటెస్ట్

‘సిఎంలు’...స్వాములు...!

భారతదేశంలో రాజకీయాలకు, మతాలకు అతి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇందులో ఫలానా మతమని కాదు..అన్ని మతాలకు చెందిన స్వాములు, మౌలాలీలు,ప్రవక్తలు, పాస్టర్లు, ఫకీర్లు, ఒకరేమిటి..దేవునికి సంబంధించిన వారంతా..రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. ఆయా మతాలకు చెందిన వారి ఓట్లన్నీ గంపగుత్తగా పొందేందుకు..ఆయా మతపెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయనాయకులు నానా తంటాలు పడుతుంటారు. అయితే..మతాలకు సంబంధించి ఉత్తరభారతదేశంలో ఉన్నంత వెర్రి, మొన్న మొన్నటి దాకా దక్షిణభారతదేశంలో పెద్దగా లేదు. ఎప్పుడైతే..దక్షిణభారతదేశంలో ‘బిజెపి’ పుంజుకుందో..అక్కడ నుంచి ఇక్కడ కూడా మతానికి ప్రాధాన్యత పెరిగిపోతోంది. ‘కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ’ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడు అభివృద్ధి,మెరుగైన పాలన, ప్రజల జీవన ప్రమాణాలు తదితర విషయాలకంటే...మతానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. ఇప్పుడు అదే కోవలో చేరడానికి ‘ఆంధ్రప్రదేశ్‌’ కూడా తహతహలాడు తున్నట్లు కనిపిస్తోంది.ఇప్పుడు ‘ఆంధ్రప్రదేశ్‌’లో  పాలకులు ఎవరైనా..ఆయా మత పెద్దలను, గురూజీలను కలుసుకోవడానికి, వారితో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. గతంలో ‘చంద్రబాబునాయుడు’ ఈ విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కాదు...అయితే ‘బిజెపి’ రంగ ప్రవేశంతో ఆయన కూడా రూట్‌ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. 


ఇటీవల కాలంలో తెలంగాణ, ‘ఆంధ్రా’ సిఎంలుగా వ్యవహరించిన ‘కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, నారా చంద్రబాబునాయుడు’లు ఈ విషయంలో బహిరంగంగానే..ఆయా స్వాములకు మొక్కుతున్నారు. నిన్న ‘ఆంధ్రప్రదేశ్‌’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ‘దత్తపీఠాధిపతి’ ‘గణపతి సచ్చిదానందస్వామి’ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన గెలుపుకోసం ‘యజ్ఞం’ చేశారని చెప్పుకున్నారు. ఈ విషయం ఆయన చెప్పేవరకూ చాలా మందికి తెలియదు. ఇందులో తప్పేమీ లేకపోయినా..‘చంద్రబాబు’ కూడా ‘జగన్‌’ ‘కెసిఆర్‌’ల వలే గెలుపు కోసం ‘స్వాముల’ సహకారం తీసుకున్నారా..?  అనే విషయంపై చర్చ సాగుతోంది. అయితే..ఇక్కడ ‘గణపతి సచ్చిదానందస్వామి’ ‘చంద్రబాబు’ అడగకుండానే..ఆయన గెలుపుకోసం, రాష్ట్రాభివృద్ధికోసం యాగం చేశారని తెలుస్తోంది. మిగతా స్వాములకు ఆయనకు తేడా ఏమిటంటే..ఆయన రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజాశ్రేయస్సు కోసం పరితపిస్తున్నారు. తమ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని, అది మంచిపాలకులవల్లే సాధ్యం అవుతుందని నమ్మి అటువంటి వారి కోసం ప్రార్థించారు. ఇందులో ఆయన స్వార్థం ఏమీ లేదు. అయితే ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ పెద్దగా మతపరమైన విషయాల గురించి ప్రాధాన్యత ఇవ్వరు. అయితే..‘జగన్‌’ తనను అరెస్టు చేసిన తరువాత, జైలు నుంచి విడుదలైన తరువాత, బిజెపితో పొత్తు పెట్టుకున్న తరువాత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. లౌకికవాదిగానే ‘చంద్రబాబు’కు గుర్తింపు ఉంది. అయితే..రాజకీయ అవసరాలు, ఇతరత్రా విషయాల వల్ల ఆయన ఇటీవలకాలంలో  ధార్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే..ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే...ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు నాలుగు మంచిమాటలు చెప్పి,వారిని మంచిదారిలో నడిపించే స్వాములు, ప్రవచనకారులును ఆయన ప్రోత్సహిస్తున్నారు. వారితో..కలిసేందుకు, వారి వద్ద నుంచి మంచినిగ్రహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 


కాగా ఇప్పుడు కొందరు..గతంలో ‘జగన్‌’ ‘విశాఖపీఠాని’కి చెందిన ‘స్వరూపానంద’ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘జగన్‌’ స్వాములను కలిస్తే..తప్పు..‘చంద్రబాబు’ కలిస్తే ఒప్పా..అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే..‘జగన్‌’కూ..‘చంద్రబాబు’కు మధ్య చాలా తేడాఉంది.  అప్పట్లో ‘జగన్‌’ ‘స్వరూపానంద’కు మొక్కడంపై విమర్శలు వెల్లువెత్తాయనేది నిజమే. అప్పట్లో ‘జగన్‌’ గెలిచిన తరువాత ‘స్వరూపానంద’ ఆయనను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. ఆయన చేసిన వెకిలిచేష్టలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. భగవంతుని ప్రతిరూపాలమని చెబుతూ..భగవంతుని సేవకులమని చెబుతూ..వ్యక్తులకు ముద్దులు పెట్టడమేమిటని హిందూమత పెద్దలు, హిందూమతస్తులు.. ‘స్వరూపానంద’పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే..‘జగన్‌’ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన గెలుపు కోసం ‘స్వరూపానంద’ యాగం చేశారట. ముందుస్తు ఒప్పందం ప్రకారం..హిందూ ఓట్లను ‘జగన్‌’కు మళ్లించేందుకే..అప్పట్లో ‘స్వరూపానందస్వామి’ ఆ విధంగా చేశారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి క్రైస్తవ మతస్తుడైన ‘జగన్‌’కు హిందూ ఓట్లు పడవని, రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న హిందువుల ఓట్లను ఆకర్షించడానికి ‘జగన్‌’తో హిందూధార్మిక కార్యక్రమాలు (‘జగన్‌’ హిందూమతంలో చేరాడనే ప్రచారాన్ని చేయించారు) జరిపించారు. ఆయన పేరిట యాగాలు, హోమాలు చేయించారు. దీనివల్లే ‘జగన్‌’ గెలిచారని మత విశ్వాసాలను నమ్మేవారు..నమ్మకంగా చెబుతారు. స్వయంగా క్రైస్తవుడైన ‘జగన్‌’ కూడా ‘స్వరూపానందస్వామి’ వల్లే గెలిచానని అప్పట్లో పరోక్షంగా చెప్పుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత నేరుగా ‘విశాఖ’కు వెళ్లి..‘స్వామి’ని భక్తిశ్రద్ధలతో పూజించి సేవించారు. ఆ తరువాత ‘స్వరూపానందస్వామి’కి ఎకరాలకొద్దీ ప్రభుత్వ భూమిని కేటాయించి ఆయన సేవలో తరించారు. ఆయనొక్కరే కాదు..ఆయన పార్టీలో నెంబర్‌ టూ అయిన ‘విజయసాయిరెడ్డి’ది కూడా అదేబాట. కేవలం ‘జగనే’ కాదు..! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ‘కె.చంద్రశేఖర్‌రావు’ కూడా స్వాములు చుట్టూనే తిరుగుతుంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు స్వాముల పంటపడిరది. ఏడాదికో..ఏడాదిన్నరకో..ఏదేదో..పేర్లు చెప్పి యాగాలు చేసేవారు. యాగక్రతువులంటూ.. కోట్లకొద్ది ప్రజల సొమ్మును వారికి పంచిపెట్టేవారు. ‘జగన్‌’ ‘చంద్రబాబు’ల కంటే..ఈ విషయంలో ‘కెసిఆర్‌’ది మరీ వింత ధోరణి. ప్రజాసేవ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నించకుండా..అడ్డదిడ్డంగా పాలన చేసి, లక్షల కోట్లు దోచుకోవడం..తరువాత ప్రజాగ్రహం పోవడానికంటూ.. స్వాములు చుట్టూతిరిగి యజ్ఞయాగాదులు..అంటూ మళ్లీ ప్రజల సొమ్ము ధారబోయడం పాలకులకు అలవాటుగా మారింది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ